ప్రభుత్వం అందించే ప్రతి రూపాయి ప్రజలకే: ఎమ్మెల్యే
ABN , Publish Date - Oct 20 , 2024 | 11:56 PM
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే ప్రతి రూపాయి ప్రజలకే దక్కేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు.
చెన్నూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే ప్రతి రూపాయి ప్రజలకే దక్కేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు. పల్లెపండుగ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం మండలంలోని కొండపేట గ్రామంలో సిమెం టు రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్తాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పల్లెల్లో నిత్యం పండుగ నెలకొనాలన్న సదుద్దేశ్యంతో కోట్లాది రూపాయలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఈ ప్రభుత్వం మహిళాభి వృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు.
వల్లూరు: పెద్దలేబాక పంచాయతీలోని చిన్ననాగిరెడ్డిపల్లెలో సీసీ రోడ్డు, గోకులం షెడ్డు నిర్మాణానికి శంకుస్థాన చేశారు. టీడీపీ మం డల నాయకుడు నాగేశ్వర్‌రెడ్డి మాజీ సర్పంచ శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.
సీకేదిన్నె: బుగ్గలపల్లె పంచాయతీ నాగిరెడ్డిపల్లెలో ఆదివారం పల్లెపండుగ కార్యక్రమాన్ని ఎంపీడీఓ కుళాయిబాబు నాయకులతో కలిసి ప్రారంభిం చారు. ఏపీఓ రామాంజనేయులరెడ్డి, కార్యదర్శి సునీల్ పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీల బలోపేతమే లక్ష్యం: ఎమ్మెల్యే
పెండ్లిమర్రి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల బలోపేతమే కూటమి ప్ర భుత్వ లక్ష్యమని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి తెలిపారు. మండల పరిఽధిలోని కొత్త గంగిరెడ్డిపల్లె పంచాయతీలోని సోగాలపల్లె, నందిమండలం గ్రామాల్లో ఆదివారం పల్లెపండుగ వారోత్సవాల్లో భాగంగా సీసీరోడ్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
అన్ని గ్రామాల్లో రోడ్లు ఏర్పాటుకు కృషి
వేంపల్లె, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రోడ్లు లేని ప్రతి గ్రామంలోను సిమెంటు రోడ్లు ఏర్పాటుచేసేందుకు కృషిచేస్తామని టీడీపీ వేంపల్లె మండల పరిశీలకుడు అజ్జుగుట్టు రఘునాథరెడ్డి తెలిపారు. ఇడుపులపాయ ఎస్సీకాలనీలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 10లక్షల వ్యయంతో సిమెటు రోడ్డు పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు.