ప్రతి మహిళా పెరటి తోటలు పెంచాలి
ABN , Publish Date - Sep 11 , 2024 | 11:36 PM
ప్రతి మహిళ ఇంటి వద్ద పెరటి తోటలు పెంచుకోవాలని ప్రకృతి వ్యవసాయ అడిషనల్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వసంతకుమారి సలహా ఇచ్చారు.
పెండ్లిమర్రి, సెప్టెంబరు 11: ప్రతి మహిళ ఇంటి వద్ద పెరటి తోటలు పెంచుకోవాలని ప్రకృతి వ్యవసాయ అడిషనల్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వసంతకుమారి సలహా ఇచ్చారు. బుధవారం పెండ్లిమర్రి మండల సమాఖ్యలో ప్రకృతి వ్యవసాయంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వసంతకుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకర పంటలు, వాతావరణం నెలకొని ఉం టుందన్నారు. ఇప్పటికే రసాయన ఎరువుల కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. నేల స్వభావం కోల్పోతోందన్నారు. దీన్ని అరికట్టాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం వెంకటేశ్వరరావు, సందీప్, సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.