Share News

ప్రతి కార్మికుడు యూనిఫాం తప్పనిసరిగా ధరించాలి

ABN , Publish Date - Oct 08 , 2024 | 11:57 PM

ప్రతి పారిశుధ్య కార్మికుడు యూనిఫాం తప్పనిసరిగా ధరించాలని ఇనచార్జ్‌ కమిషనరు రాకేశచంద్రన తెలిపారు.

ప్రతి కార్మికుడు యూనిఫాం తప్పనిసరిగా ధరించాలి
అధికారులు, కార్మికులకు సూచనలు ఇస్తున్న ఇనచార్జ్‌ కమిషనరు రాకేశచంద్రన

ఇనచార్జ్‌ కమిషనరు రాకేశచంద్రన

కడప (ఎడ్యుకేషన), అక్టోబరు 8: ప్రతి పారిశుధ్య కార్మికుడు యూనిఫాం తప్పనిసరిగా ధరించాలని ఇనచార్జ్‌ కమిషనరు రాకేశచంద్రన తెలిపారు. మంగళవారం కడప నగరం శంకరాపురం, అశోక్‌నగర్‌తో పాటు రాధాక్రిష్ణనగర్‌ ప్రాంతాల్లో పారిశుధ్యం పరిశీలించారు. ఆయన పారిశుధ్య కార్మికులతో మాట్లాడుతూ శానిటేషన విభాగం ప్రతి రోజూ పరిశుభ్రతా చర్యలు పాటించాలన్నారు. డ్రైనేజీలను సక్రమంగా నిర్వహించాలన్నారు. చెత్త పాయింట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. రోడ్లపై ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్పొరేషన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2024 | 11:57 PM