Share News

ఓటర్ల జాబితా సవరణకు 20 రోజుల గడువు

ABN , Publish Date - Sep 28 , 2024 | 11:38 PM

ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకోవాడానికి 20 రోజుల గడువు ఉందని సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ పేర్కొన్నారు.

ఓటర్ల జాబితా సవరణకు   20 రోజుల గడువు
రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచనలిస్తున్న సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌

మదనపల్లె టౌన, సెప్టెంబరు 28: ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకోవాడానికి 20 రోజుల గడువు ఉందని సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్‌ మాట్లాడుతూ మదనపల్లె నియోజక వర్గంలోని అన్ని పోలింగ్‌ స్టేషనల వద్ద బీఎల్‌వోలు అందుబా టులో ఉంటారని, రాజకీయ పార్టీ నాయకులు కూడా బీఎల్‌ఏ లను నియమించుకుని జాబితా ఇస్తే జిల్లాకలెక్టర్‌కు పంపుతామ న్నారు. అక్కడి నుంచి ఆమోదం వస్తే బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు కలసి ఇంటింటి వెళ్లి ఓటర్ల జాబితా సవరణలు చేయవచ్చన్నా రు. ముఖ్యంగా మృతి చెందిన ఓటర్లు, వలస వెళ్లిన వారు, డూప్లికేట్‌ ఓటర్ల వివరాలను గుర్తించి వారిని తొలగించవచ్చ న్నారు. దీంతో పాటు 18 ఏళ్లు నిండిన వారిని ఓటరుగా నమో దు చేయవచ్చన్నారు. నియోజకవర్గాలు మారిన ఓటర్ల వివరాల ను తెలుసుకోవచ్చన్నారు. అక్టోబరు 18వ తేదీ వరకు గడువు ఉందని, అప్పటి లోపు బీఎల్‌వోలకు జాబితా ఇవ్వాలని అక్టోబరు 29న కొత్త ఓటర్ల జాబితా ప్రకటిస్తారన్నారు. ఈ సమావేశంలో మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం తహసీల్దార్లు ఖాజాభి, నిర్మలాదేవి, ధనుంజేయులు, కాంగ్రెస్‌ నాయకుడు రెడ్డిసాహెబ్‌, జనసేన నాయకుడు జంగాల శివరామ్‌, టీడీపీ నాయకుడు బాలుస్వామి, సీపీఎం శ్రీనివాసులు, సీపీఐ మురళి, ఆప్‌ పార్టీ నాయకుడు కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2024 | 11:38 PM