Share News

వరద బాధితులకు సరుకులు పంపిణీ చేస్తాం : ఎమ్మెల్యే

ABN , Publish Date - Sep 12 , 2024 | 11:56 PM

విజయవాడలో వరద బాధితులకు సరుకులు, గ్యాస్‌ స్టౌవ్‌లు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు.

వరద బాధితులకు   సరుకులు పంపిణీ చేస్తాం : ఎమ్మెల్యే
విజయవాడ సింగ్‌నగర్‌లో పర్యటిస్తూ అధికారులతో చర్చిస్తున్న ఎమ్మెల్యే షాజహానబాషా

మదనపల్లె టౌన, సెప్టెంబరు 12: విజయవాడలో వరద బాధితులకు సరుకులు, గ్యాస్‌ స్టౌవ్‌లు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు. గురువారం విజయవాడకు చేరుకున్న ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు అక్కడ విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో చర్చించి మదనపల్లె నుంచి తీసుకొచ్చిన మూడు లారీల సరుకులను సెంట్రల్‌ విజయవాడలోని సింగ్‌నగర్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో వరద బాధితులకు పంపిణీ చేస్తామన్నారు. సింగ్‌నగర్‌లో పర్యటించి ఉన్నతాధికారులతో చర్చించి, మారుమూల ఉండే బాధితులను గుర్తించారు. వారికి మదనపల్లె నుంచి తీసుకెళ్లిన సరుకుల కిట్లను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల, టీడీపీ నాయకులు నాదెళ్ల విద్యాసాగర్‌, నాగార్జున గాంధీ, బాలుస్వామి, తదితరులు పాల్గొన్నారు.

వరద బాధితుల సహాయార్థం మిట్స్‌ చేయూత

కురబలకోట, సెప్టెంబరు 12: విజయవాడలో వరద బాధి తుల సహాయార్థం మిట్స్‌ విద్యార్థులు చేయూతనం దించారు. కళాశాలో ఎన ఎస్‌ఎస్‌ విబాగం ఆధ్వ ర్యంలో రూ.51వేల విరాళాలను సేక రించారు. కాగా ఈ విరాళా న్ని సీఎం సహాయనిధికి ప్రిన్సిపాల్‌ సి.యువరాజ్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్తుల సమయాల్లో ప్రతి ఒక్కరూ చేయూ తనం దించి ఆదుకోవాలన్నారు.

వరద బాధితులకు

ఆరోగ్యమాత విద్యార్థుల వితరణ

మదనపల్లె టౌన, సెప్టెంబరు 12: విజయవాడ వరద బాధితులకు పట్టణంలోని ఆరో గ్యమాత హైస్కూల్‌ విద్యార్థులు రూ.10వేల విలువ చేసే సరుకులను వితరణగా అంద జేశారు. గురువారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో డీఏవో పద్మావతికి ఈ సరుకులను అందజేశా రు. మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కంచెర్ల శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ విద్యార్థులు పాకెట్‌ మనితో విరాళాలు సేకరించి, ఈ సరుకులు కొనుగోలు చేసి వితరణగా ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యమాత స్కూల్‌ యజమాన్యం, కరాటే ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 11:56 PM