15లోపు ‘ఫ్రీహోల్డ్’ వెరిఫికేషన పూర్తి చేయాలి
ABN , Publish Date - Oct 06 , 2024 | 12:04 AM
పీలేరు మండలంలోని ఫ్రీ హోల్డ్ భూముల ఫైళ్ల పరిశీలనను ఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని పీలే రు మండల ప్రత్యేక అధికారి రమ పేర్కొ న్నారు.
పీలేరు, అక్టోబరు 5: పీలేరు మండలంలోని ఫ్రీ హోల్డ్ భూముల ఫైళ్ల పరిశీలనను ఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని పీలే రు మండల ప్రత్యేక అధికారి రమ పేర్కొ న్నారు. మండలంలోని ఫ్రీ హోల్డ్ భూముల అంశంపై శనివారం ఆమె తహసీల్దారు కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో నిర్ధేశిం చిన గడువు పూర్తయినప్పటికీ పీలేరు మండ లంలో ఫ్రీ హోల్డ్ భూముల ఫైళ్లు పెండింగ్‌లో ఉండడం పట్ల జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆగ్రహంగా ఉన్నారని, 15వ తేదీలోపు వాటి పరిశీలన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పీలేరు మండలంలో గత ప్రభుత్వం కేవలం 2218 ఎకరాలకు మాత్రమే ఫ్రీ హోల్డ్ ప్రొసీడింగ్స్ ఇవ్వగా ఆనలైనలో దాదాపు 5 వేల ఎకరాలు ఫ్రీ హోల్డ్‌లో ఉన్నట్లు చూపిస్తోందన్నారు. ఈ వ్యత్యాసాలను గమనించి, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ అర్హత ఉన్న భూములనే ఫ్రీ హోల్డ్‌లో పెట్టాలన్నారు. అనంతరం పంచాయతీ ల వారీగా ఫైళ్లను సమీక్షించారు. కార్యక్రమంలో తహసీల్దారు భీమేశ్వరరావు, డీటీలు సుబ్రహ్మణ్యం, రెడ్డప్ప రెడ్డి, ఇషాక్, విజయ కుమార్ రెడ్డి, వీఆర్వోలు పాల్గొన్నారు.