Share News

reservoirs నిండు కుండల్లా.. జలాశయాలు

ABN , Publish Date - Sep 25 , 2024 | 11:50 PM

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పైతట్టు ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి నీరు చేరుతుండ డంతో గండికోట, మైలవరం ప్రాజెక్టులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి.

reservoirs నిండు కుండల్లా.. జలాశయాలు
పూర్తి స్థాయి సామర్థ్యానికి నీరు చేరడంతో కళకళలాడుతున్న గండికోట జలాశయం

గండికోట, మైలవరం నుంచి భారీగా నీటి విడుదల

పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కొండాపురం/మైలవరం, సెప్టెంబరు 25: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పైతట్టు ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి నీరు చేరుతుండ డంతో గండికోట, మైలవరం ప్రాజెక్టులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులకు ఇనఫ్లో పెరగడంతో దిగువనున్న రిజర్వాయర్లు, నదుల్లోకి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తున్నారు. కాగా గండికోట ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 25.5 టీఎంసీల నీరు నిల్వ ఉం ది. అలాగే మైలవరం జలాశయం నీటి సామర్థ్యం 6.5 టీఎంసీలు కాగా.. ప్రస్తు తం 5.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నేపధ్యంలో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వివరాలిలా...

గండికోట ప్రాజెక్టు నుంచి 10వేల క్యూసెక్కులు..

గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయానికి బుధవారం సాయింత్రం నుంచి నీటి విడుదలను పెంపుదల చేశారు. 2500 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తుండగా దానిని 10000 క్యూసెక్కులకు పెంచినట్లు డీఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టులోకి జీఎనఎస్‌ఎస్‌ కాలువ ద్వారా వచ్చే ఇనఫ్లో 10,000కు పెరగడంతో, గండికోట నుంచి మైలవరానికి నీటిని పెంచినట్లు తెలిపారు. అదేవిధంగా సీబీఆర్‌కు 1500 క్యూసెక్కులు, పెడిపాలెం రిజర్వాయిర్‌కు 770 క్యూసెక్కులు, వామికొండ, సర్వరాయసాగర్‌కు 700 క్యూసెక్కుల చొప్పున గండికోట ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

మైలవరం నుంచి 12 వేల క్యూసెక్కులు..

మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు జలాశయ ఈఈ రమేష్‌ తెలిపారు. బుధవారం గండికోట జలాశయం నుంచి 10వేల క్యూసెక్కుల నీటిని మైలవరానికి విడుదల చేస్తుండ టంతో.. మైలవరం నుంచి 4గేట్లు ఎత్తి పెన్నానదికి 12వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని తెలిపారు. ఉత్తర కాలువకు 50 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 180 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామన్నారు. గండికోట జలాశ యం నుంచి మైలవరానికి ఇనఫ్లో మరింత పెరిగితే పెన్నానదికి వదులు తామని.. పెన్నాపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Updated Date - Sep 25 , 2024 | 11:50 PM