మార్గదర్శకుడు..ఉపాధ్యాయుడు
ABN , Publish Date - Sep 06 , 2024 | 12:25 AM
మార్గదర్శకుడు ఉపాధ్యాయుడు అని వక్తలు పేర్కొన్నారు.
కడప (ఎడ్యుకేషన), సెప్టెంబరు 5 : మార్గదర్శకుడు ఉపాధ్యాయుడు అని వక్తలు పేర్కొన్నారు. కడప నగరం గురుకుల్ విద్యాపీట్ హైస్కూలులో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్వేపల్లి రాధాక్రిష్ణన చిత్రపటానికి పూలమాల వుసి నివాలళులర్పించారు. జాతీయ స్థాయిలో ప్రఖ్యాత చెందిన నాయకులను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు తమ గురువులను పూజించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఏవీఆర్ విద్యాసంస్థల అధినేత ఎ.వెంకటేశ్వర్లు, పాఠశాల డైరెక్టరు ఎ.వీరకుమారి, ఏవీఆర్ సీఈవో ఎఎల్ వివేకానంద, ప్రిన్సిపాల్ ఎంఎన మునిచంద్ర, వైస్ ప్రిన్సిపాల్ నరసింహ పాల్గొన్నారు.
శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో...
కడప నగరం ఉక్కాయపల్లె శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్ధినీ విద్యార్థులందరూ క్రమశిక్షణయుతమైన జీవన విధానాలను అవలంభించడం విలువలతో కూడిన విద్య విధానం వల్ల దేశాభివృద్ధికి తోడ్పడే విధంగా తయారు కావాలని సూచించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై.నాగరాజ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివిధ విబాగాధిపతులు విద్యార్థులకు బహుమతులు అందించారు.
నాగార్జున ఇంగ్లీషు మీడియం స్కూలులో...
కడప నగరం నాగార్జున హైస్కూలులో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహంచారు. ప్రధానోపాధ్యాయులు క్రిష్ణారెడ్డి సర్వేపల్లి రాధాక్రిష్ణ చిత్రపటానకిపూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే సర్వేపల్లి చేసిన సేవలను వివరించారు. దేశం తలరాతలను రాసిన దేశభవిష్యత్తునిర్దేశించేది తరగతిగదిలోని ఉపాధ్యాయుడేననన్నారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టరు శివప్రసాద్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పులివెందులలో...
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎనఎ్‌సఎ్‌స యూనిట్ 1, 2 ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసులు అధ్యక్షత వహించి ఉపాధ్యాయుల ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థుల అభివృద్ధికి, సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తారన్నారు. వైస్‌ప్రిన్సిపాల్ సుధీర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నారు. డాక్టర్ బాలనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు మంచి నడవడిక కలిగి ఉండాలన్నారు. అనంతరం ఎనఎ్‌సఎ్‌స ప్రోగ్రాం ఆఫీసరు డాక్టర్ శ్రీనిత మాట్లాడారు. ఎనఎ్‌సఎ్‌స కో ఆర్డినేటరు శ్రీనివాసులురెడ్డి, డాక్టర్ సుగుణ, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ రాధిక, ఇతర అధ్యాపక, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.