మేలైన యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి
ABN , Publish Date - Oct 08 , 2024 | 11:31 PM
మేలైన యాజ మాన్య పద్ధతులతో మామిడిలో అధిక దిగుబడి సాధించవచ్చని పీలేరు మం డల ఉద్యాన శాఖాధికారి సుకుమార్ రెడ్డి మామిడి రైతులకు సూచించారు.
పీలేరు, అక్టోబరు 8: మేలైన యాజ మాన్య పద్ధతులతో మామిడిలో అధిక దిగుబడి సాధించవచ్చని పీలేరు మం డల ఉద్యాన శాఖాధికారి సుకుమార్ రెడ్డి మామిడి రైతులకు సూచించారు. ఉద్యాన, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గూడరేవు పల్లె పంచాయతీలో పొలం బడి కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ తెల్ల పూత దశలో ఉన్నప్పుడు ఎటువంటి మందులు పిచి కారి చేయరాదని సూచించారు. నల్ల పూత లేదా పిందె దశలో తామర పురుగులు, పక్షి కన్ను తెగులు, కాయ తొలుచు పురుగు నివారించడానికి ఒక లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల పిప్రోనిల్, ఒక గ్రాము థయోఫినైట్ మిథైల్ కలిపి పిచికారి చేయాలన్నారు. ఈ కార్యక్ర మంలో ఏవో రమాదేవి, వీహెచఏ రాజేశ్వ రి, రైతులు పాల్గొన్నారు.
పెద్దతిప్పసముద్రంలో: మండల కేం ద్రమైన పీటీఎంలో మండల వ్యవసాయా ధికారిణి ప్రేమలత రైతులతో కలసి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మంగళ వారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాతుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం రైతుల చెంతకే అధికారులు వచ్చి వ్యవసాయంలో మెలకువలపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. రైతులకు ప్రభుత్వం అందించే యంత్ర పరికరాలు పలు సంక్షేమ పథకాలను ఎలా వినియోగించుకోవాలనే వాటిని ఆమె వివరించారు. ఈకార్యక్రమంలో వ్యవసాయశాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
పెద్దమండ్యంలో: వ్యవసాయంలో ఆధునాతన పద్ధతులను పాటించాలని పెద్దమండ్యం ఏవో సురేష్‌బాబు రైతులకు సూచించారు. మండలంలోని కోటకాడపల్లి పరిధిలో మంగళ వారం జరిగిన పొలంపిలుస్తోంది కార్యక్రమంలో ఏవో పాల్గొని మాట్లాడుతూ విత్తనశు ద్ధితో మంచి దిగుబడులు వస్తాయన్నారు. పంటలకు తెగుళ్లు సోకిన వెంటనే నివారణకు సూచనలకు వ్యసాధికారులను సంప్రదించి అదునులో ఏ పంటలు సాగు చేయాలో వ్యవసాధికారుల సలహాలను తీసుకోవాలని రైతులకు సూచించారు. వ్యవసాయ సహాయ కులు అనుదీప్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.