Share News

కోలాహలంగా వినాయకుడి నిమజ్జనం

ABN , Publish Date - Sep 11 , 2024 | 11:26 PM

వినాయక చవితి పర్వదినం సందర్భంగా గత ఐదు రోజులుగా పూజలందుకున్న వినాయకుడి విగ్రహాలను బుధవారం నిమజ్జనానికి గంగమ్మ ఒడికి తరలించారు.

కోలాహలంగా వినాయకుడి నిమజ్జనం
దేవుని కడప చెరువులో గణేశ నిమజ్జనం

కడప (కల్చరల్‌) సెప్టెంబరు 11: వినాయక చవితి పర్వదినం సందర్భంగా గత ఐదు రోజులుగా పూజలందుకున్న వినాయకుడి విగ్రహాలను బుధవారం నిమజ్జనానికి గంగమ్మ ఒడికి తరలించారు. గణనాధుడి విగ్రహాలను ట్రాక్టర్లలో, లారీలలో ఉంచి డప్పులు, టపాకాయలు, డీజే సౌండ్‌ సిస్టమ్స్‌తో నృత్యాలు చేసూ రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా నిమజ్జనం నిర్వహించారు. దేవునికడప చెరువు, , ఆలంఖానపల్లె వద్ద గల కేసీ కాల్వనీటిలో నిమజ్జనం చేశారు. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా కోలాటం, చెక్కభజనతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తు లు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ట్రా ఫిక్‌ అంతరాయం ఏర్పడింది. రాజీవ్‌ పార్క్‌ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి భారీ విగ్రహంతో పాటు బాలాజీనగర్‌లోని తారకరామనగర్‌లో, 44 వ డివిజన టీడీపీ ఇనచార్జ్‌ ఖాజాపీర్‌ పాల్గొన్నారు. యర్రముక్కపల్లె నుంచి భారీ వినాయకుడి విగ్రహం ఊరేగింపుగా, దేవునికడప చెరువు, ఆలంఖానపల్లె వద్గ గల కేసీ కెనాల్‌లో నిమజ్జనం గావించారు. కడప నగరం 49వ డివిజన ఆలంఖానపల్లె కాలనీలో రాణితోట వీధి, మసీదు వెనుక గత ఐదు రోజులుగా ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాలకు ని ర్వాహకులు పూజలు నిర్వహించారు.

చెన్నూరు: వినాయకుడి విగ్రహాలను స్థానిక పెన్నానదిలో నిమజ్జనం చేశారు. అంతకుముందు వీధివీధినా ఊరేగింపు నిర్వహిస్తూ మంగళవాయిద్యాలు, టపాసులు పేల్చుతూ యువత డ్యాన్సలు వేశారు. చెన్నూ రు శివాలయం వీధిలో ఏర్పాటు చేసిన గణేష్‌ లడ్డూకు 15 మంది పోటాపోటీగా కొండపేటకు చెందిన టీడీపీ నేత, మాజీ సర్పంచ మన్నె మోహనరెడ్డి, రూ.50 వేలకు దక్కించుకున్నారు.

చింతకొమ్మదిన్నె: చింతకొమ్మదిన్నె మండలంలో గణేష్‌ నిమజ్జనాలు 5వ రోజు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి లడ్డూను వేలంపాట నిర్వహించి అన్నదానాలు ఏర్పాటు చేశారు.

Updated Date - Sep 11 , 2024 | 11:26 PM