ఆస్థి కోసమే తల్లిని గొంతు కోసి చంపారు
ABN , Publish Date - Sep 27 , 2024 | 12:00 AM
ఆస్థి కోసమే తల్లిని గొం తు కోసి దారుణంగా చంపా రని సీఐ రాజారమేష్ పేర్కొ న్నారు.
హత్య కేసులో కొడుకు, కోడలు అరెస్టు
ములకలచెరువు, సెప్టెంబరు 26: ఆస్థి కోసమే తల్లిని గొం తు కోసి దారుణంగా చంపా రని సీఐ రాజారమేష్ పేర్కొ న్నారు. ఈదారుణానికి వడి గట్టిన కొడుకు, కోడలిని గు రువారం అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు స్థానిక సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సీఐ రాజారమేష్, ఎస్‌ఐ గాయత్రి వివరాలను వెల్లడించారు. ములకలచెరువులోని కదిరి రోడ్డులో నివాసముంటున్న షేక్ షఫియా బేగంకు ఇద్దరు కుమారులు పెద్దరెడ్డి బాషా, చిన్నరెడ్డిబాషా, కుమార్తె సోనిలు ఉన్నారు. ఈమె భర్త షేక్ హైదర్‌వల్లి ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో షఫియాబేగం చిన్నకుమారుడు చిన్నరెడ్డిబాషా దగ్గర ఉంటోంది. తమకున్న ఆస్థి మొత్తం తనకే ఇవ్వాలని చిన్నరెడ్డిబాషా తల్లితో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 22వతేదీన తల్లి షేక్ షఫియాబేగం(55)పై మరోసారి గొడవకు దిగిన చిన్న రెడ్డిబాషా, అతని భార్య అర్షియాలు కట్టెతో కొట్టి, గొంతు కోసి దారుణంగా హత్య చేశారన్నారు. షఫియా బేగం కూతురు సోని ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసిన పోలీసులు చిన్నరెడ్డిబా షా(31), అతని భార్య అర్షియా(25)లను తంబళ్లపల్లె రోడ్డులో అరెస్టు చేసి హత్యకు వినియోగించిన కత్తి, దాడి చేసిన కట్టెలను సీజ్ చేశారన్నారు. రిమాండ్ నిమిత్తం తంబళ్లపల్లె కోర్టులో హాజ రు పరుస్తామని సీఐ రాజారమేష్ తెలిపారు.
తప్పిపోయిన బాలుడిని
చైతన్య అనాఽథాశ్రమానికి తరలింపు
మదనపల్లె అర్బన, సెప్టెంబరు 26: పట్టణంలోని ఎస్టేట్ పరిసర ప్రాంతంలో ఐదేళ్ల బాలుడు బుధవారం రాత్రి తచ్చాడుతుంటే స్థానికులు పోలీసులకు సమా చారం అందించగా వారు చైతన్య అనాథాశ్రమానికి తరలించారు. తాలుకా సీఐ కళా వెంకటరమణ ఆదేశాల మేరకు ఎస్‌ఐ హరిహ రప్రసాద్ అక్కడికి చేరుకుని బాలున్ని విచారించగా ఎక్కడ నుంచి వచ్చాడు, ఏమి వివరాలు చెప్పలేని పరిస్థితిలో దేవతానగడర్ లోని చైతన్య అనాధాశ్రమానికి తరలించారు. ఈ బాలునికి సంబంధించిన ఆధారాలు దొరొకేవరకు ఆశ్ర మంలో అవకాశం కల్పించాలని పోలీసులు కోరారు. ఈ పిల్లవాడి గురించి వివరాలు ఎవ్వరికైనా తెలిసిన వెంటనే 9493871884, 9133006333 నెంబర్లకు పోన చేయాలని తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
పీలేరు, సెప్టెంబరు 26: అనుమానా స్పద స్థితిలో చెరువులో శవమై తేలిన ఓ వివాహిత ఉదంతం గురువారం పీలేరులో వెలుగు చూసింది. పీలేరు ఎస్‌ఐ బాలకృష్ణ కథనం మేరకు పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె పం చాయతీ మొరవవడ్డిపల్లె చె రువులో ఓ మహిళ శవం తేలియాడు తున్నట్లు స్థానికులు గురువారం పీలేరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసు లు చెరువు వద్ద కు చేరుకుని అగ్నిమాపక సిబ్బంది, పారిశుధ్య కార్మికుల సాయంతో శవాన్ని ఒడ్డుకు చేర్చి విచారణ ప్రారం భించారు. శవం బాగా కుళ్లిన స్థితిలో ఉండడం, నడుము కు రాయి కట్టి ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు చుట్టుప క్కల విచారిం చడంతో మృతురాలి ఆచూకీ లభ్యమైంది. ఆమె స్థానికంగా బట్టీ ల పనిచేసే తమిళనాడుకు చెందిన మణి భార్య సాయిసుధ(25)గా గుర్తించారు. గత మంగళవారం రాత్రి భార్యా భర్తలు గొడవ పడి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని, అప్పటి నుంచి కనిపించకుండా ఉందని తేలింది. ఆమె ఆత్మహత్య చేసు కుందా? లేక ఎవరైనా చంపి నడుముకు రాయి కట్టి చెరువులో పడేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి స్నేహ, కృష్ణదేవ అనే ఇద్దరు పిల్లలున్నారు. పోలీసు లు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుప త్రికి తరలించారు.
టీడీపీ కార్యకర్తకు చెందిన ఆటోకు నిప్పు
తంబళ్లపల్లె, సెప్టెంబ రు 26: తంబళ్లపల్లె మండలంలోని గోపి దిన్నె పంచాయతీ బ ళ్లాపురంపల్లెకు చెంది న టీడీపీ సీనియర్ కార్యకర్త కే.వీరాంజినే యులుకు చెందిన ఆటో కు బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టి కాల్చివేశారు. దీనిపై బాధితుడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి వెళ్లి మంటల్లో కాలి పోయిన ఆటోను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేప ట్టినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు.. ఇటీవల వైసీపీ వర్గీయుల నుంచి వీరాంజినేయులు కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి గ్రామంలో ఉన్న పలువురు వైసీపీ వర్గీయులు అతనిపై కక్ష పెంచుకున్నారని ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గ్రామానికి వచ్చే రోడ్డులో ఓ వైపు ఖాళీ స్థలం లో ఉంచిన తన ఆటోకు నిప్పుపెట్టారన్నారు. అర్థరాత్రి ఒంటి గం ట సమయంలో టమోటాలను మార్కెట్‌కు తరలించే వాహన డ్రైవర్ ఆటో మంటల్లో కాలిపోతుండటం గమనించి తనకు సమా చారం ఇచ్చాడన్నాడు. దీంతో వీరాంజనేయరెడ్డి, వెంకటరమణా రెడ్డి, విజయకుమార్‌రెడ్డిలు నిప్పు పెట్టినట్లు అనుమానం ఉం దని పోలీసులకు ఇచ్చిన ఫిర్యా దులో పేర్కొన్నాడు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.