నమోస్తుతే.. జగన్మాత
ABN , Publish Date - Oct 03 , 2024 | 11:45 PM
నమోస్తుతే.. జగన్మాత అంటూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
వైభవంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనమివ్వనున్న అమ్మవారు
మదనపల్లె అర్బన, అక్టోబరు3: నమోస్తుతే.. జగన్మాత అంటూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అమ్మవారి ఆలయాలను విద్యుద్దీపాలతో ముస్తాబు చేసి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసా ఆయా ఆల యాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం నుంచి ఈ నెల 12 వరకు దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మదనపల్లె పట్టణంలోని వాసవీభవన వీధిలో వాసవీ కన్యాకాపర మేశ్వరీ దేవికి దసరా ఉత్సవాల మొదటి రోజైన గురువారం సాయంత్రం దేవి శరన్నవరాత్రులను పురష్కరించుకుని ఆర్యవైశ్య సంఘం అనుబంద సంస్థల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చ కుడు రామచంద్ర అమ్మవారిని బాలాత్రిపుర సుందరిగా అలంకరణ చేసి విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పిం చారు. మదనపల్లె ఆర్యవైశ్యసంఘం అథ్యక్షుడు పూనగంటి ఓంప్రకాష్, ఉపాధ్యక్షుడు దేవతా సతీష్, కార్చదర్శి సూరేగిరిధర్ భక్తులకు తీర్ధప్రసా దాలను పంపిణీ చేశారు. దేవతానగర్‌లోని రాజరాజేశ్వరీదేవి ఆలయంలో విజయదశమిని పురస్కరించకుని ఆలయంలో ఆలయ దర్మకర్త పతాం జలీస్వామి ఆధ్వర్యంలో అమ్మవారిని బాలత్రిపురసుందరి దేవి అలంకరణ చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కోర్టులో వెలసిన గంగమ్మకు పసుపు అలంకరణ చేసి ఆలయకమిటీ అధ్యక్షుడు చిన్న రెడ్డెప్ప, కార్య దర్శి మార్పూరి ప్రభాకర్‌నాయుడు, ఉపాధ్యక్షుడు పెరవలి వేణుగోపాల్ నాయుడు, కమిటీ సభ్యులు భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే నీరుగటగ్టువారిపల్లెలోని చౌడేశ్వరీదేవి ఆలయంలో పసుపు అలంకరణ చేసి ఆలయకమిటీ అధ్యక్షుడు పురాణం చంద్రశేఖర్, కోశాధి కారి రామి శెట్టి రత్నమయ్య, కార్యదర్శి పవనకుమార్‌ల పర్యవేక్షణలో భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించి భక్తులకు అన్నదానం చేశారు. దేఽవళంవీధి లోని సోమేశ్వరస్వామిఆలయంలో ప్రధానఅర్చకుడు ఫణీంద్రస్వామి అమ్మవారిని కామాక్షి అలంకరణ చేసి విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. దేవళంవీదిలోని ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయంలో దసరా మహోత్సవాలను ఆల య ఈవో రమణ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు గోవర్థన పర్య వేక్షణలో స్వామివార్లును విశేషంగా అలంకరణలు చేసిన అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కాగా మదనపల్లె మున్సిపల్ కమి షనర్ ప్రమీల స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. అనపగుట్టలో ఉన్న అభయలక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడు రమేష్‌స్వామి ఆధ్వర్యంలో లక్ష్మీనరసంహుడికి పసుపు అలం కరణతో పూజలు నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.
పీలేరులో: దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు గురువారం పీలేరు పట్టణం లో శాసో్త్రక్తంగా ఆరంభమయ్యాయి. పట్టణంలోని రౌద్రాల అంకాళమ్మ, కన్యకా పరమేశ్వరి, మోడల్ కాలనీ వద్దనున్న ఎల్లమ్మ, ఇందిరమ్మ కాలనీ వద్దనున్న దిన్నె గంగమ్మ ఆలయాల్లో ఉత్సవాలను ఆయా ఆలయాల ఉత్సవ కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఉత్సవాల్లో తొలిరోజు రౌద్రాల అంకాళమ్మ బాలాత్రిపుర సుందరీ దేవిగా, కన్యకా పరమేశ్వరి అమ్మవారు వాసవీ అలంకరణలో, ఎల్లమ్మ తల్లి దుర్గాదేవిగా భక్తులకు దర్శశనమి చ్చారు. ఉత్సవాల ఆరంభం సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
గుర్రంకొండలో:దసరా ఉత్సవాల్లో భాగంగా మండలంలోని చెర్లోపల్లె రెడ్డెమ్మకొండ ఆలయంలో గురువారం అమ్మవారు రెడ్డెమ్మ తల్లిగా భక్తుల కు దర్శనమిచ్చారు. అనంతరం మహిళల చేత సామూ హిక కుంకుమా ర్చన నిర్వహించారు. భక్తులకు భక్తులకు తీర్థప్రసాదాలను, అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఈవో మంజుల, సిబ్బంది పాల్గొన్నారు.
కలికిరిలో: దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు పట్టణంలో వెలసిన గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి రజత కవచాల అలంకృ తురాలై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమ ర్పించిన అనంతరం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులకు అవస రమైన ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు అశోక్‌కుమార్ రెడ్డి, మధుసూ దనరెడ్డి, సురేంద్రరెడ్డి పర్యవేక్షించారు. పట్టణంలోని వాసవీ కన్యకాపరమే శ్వరి ఆలయంలో అమ్మవారు గురువారం బాలాత్రిపురసుందరి అవతారంలో సాక్షాత్కరించారు. అమ్మవారి పూజాదికాలు పూర్తయిన అనంతరం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో భక్తులు దర్శించుకున్నారు.
వాల్మీకిపురంలో: వాల్మీకిపురం మండలం వ్యాప్తంగా గురువారం శరన్న వరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని గండ బోయనపల్లె సత్యమ్మతల్లి బాలాత్రిపుర సుందరిదేవి అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు.. పట్టణంలోని లక్ష్మీకామేశ్వరస్వామి ఆలయం, నల్లవీరగంగాభవానీ ఆలయం, గొల్లపల్లెలోని విరూపాక్షమ్మ దేవాలయా లలో అమ్మవార్లకి త్రిపుర సుందరీదేవి అలంకరణలు, బజారువీధిలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో చాముండేశ్వరిదేవీ అలంకర ణలు గావించి పూజలు చేశారు. తొలిరోజు ఆలయాలు భక్తులతో కిటకిట లాడగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమాలలో ఆలయాల ధర్మకర్తలు పులి సత్యారెడ్డి, రమణారెడ్డి, కువైట్ శంకర, సతీష్, అర్చకులు. భక్తులు పాల్గొన్నారు.