నేతన్న నేస్తం పథకం అమలు చేయాలి: అవ్వారు
ABN , Publish Date - Oct 01 , 2024 | 12:09 AM
చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం తిరిగి అమలు చేయాలని చేతివృత్తుల ఐక్య వేదిక పార్టీ జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున డిమాండ్ చేశారు.
కడప (మారుతీనగర్), సెప్టెంబరు 30: చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం తిరిగి అమలు చేయాలని చేతివృత్తుల ఐక్య వేదిక పార్టీ జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అవ్వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అయినా అర్హులైన ప్రతి కుటుంబానికి నేతన్న నేస్తం పథకాన్ని తప్పక వర్తించే లా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప లు పార్టీల, ప్రజాసంఘాల నాయకులు జె.వి.రమణ, సంగటి మనోహర్, వై.ఎం. ప్రతాపరెడ్డి, పి.వి.రమణ, బి.సి. గంగులు, శ్రీరామ్‌దాస్ ఆంజనేయులు, చెన్నారామయ్య, గున్నా జయరాములు, మల్లయ్య, జి. రామచంద్ర, తదితరులతో పాటుగా పలువురు చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.