Share News

One bed - three patients : ఒక బెడ్‌ - ముగ్గురు రోగులు

ABN , Publish Date - Oct 15 , 2024 | 11:28 PM

రాయచోటిలో వంద పడకల ఆస్పత్రి ప్రారంభమై దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు రోగుల ను బెడ్లు, ఫార్మసీలో సిబ్బంది కొరత వేధిస్తోంది. పదేళ్లుగా ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న వంద పడకల ఆస్పత్రి నేటికీ పూర్తి స్థాయిలో సేవ లు అందించడానికి సిద్దంగా లేదు.

One bed - three patients : ఒక బెడ్‌ - ముగ్గురు రోగులు
ఒకే బెడ్‌పై ముగ్గురు పడుకుని ఉన్న దృశ్యం

రాయచోటి(కలెక్టరేట్‌)అక్టోబరు15(ఆంధ్రజ్యోతి): రాయచోటిలో వంద పడకల ఆస్పత్రి ప్రారంభమై దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు రోగుల ను బెడ్లు, ఫార్మసీలో సిబ్బంది కొరత వేధిస్తోంది. పదేళ్లుగా ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న వంద పడకల ఆస్పత్రి నేటికీ పూర్తి స్థాయిలో సేవ లు అందించడానికి సిద్దంగా లేదు. అరకొర సమ స్యలున్నాయనే వాదన బలంగా వినపడుతోంది. ఈ ప్రాంతంలో ఏదైనా ఒక చిన్న ప్రమాదం జరిగినా వెంటనే తిరుపతికి, కడపకు రెఫర్‌ చేసే రోజుల నుంచి అన్నిరకాల సదుపాయాలతో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు వరకు వెళ్లినా అరకొర సౌకర్యాలతో కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకెళితే....

రాయచోటిని జిల్లా కేంద్రం చేశాక వైసీపీ ప్రభు త్వం పలు జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా దాదాపు రూ. 24 కోట్లతో వం ద పడకల ఆస్పత్రి నిర్మాణం అయితే చేశారే కాని ఆస్పత్రులపై వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూడ డంతో అరకొర సౌకర్యాల నడుమ ఆస్పత్రి నిర్వహ ణ కొనసాగుతోంది. ఈ ఆస్పత్రిలో అన్ని రకాల జ బ్బులకు సంబంధించిన డాక్టర్లను పూర్తి స్థాయిలో నియమించినా కొందరు సమయపాలన పాటించ డం లేదనే ఆరోపణలున్నాయి. వంద పడకల ఆస్పత్రిలో కేవలం 60 బెడ్‌లకు మాత్రమే అధికారులు చర్యలు తీసుకున్నారు. మిగి లిన వాటిపై ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు తీసుకోక పోవడం పలు రకాల విమర్శ లకు తావిస్తోంది. ఫలితంగా రోగులు ఒకే బెడ్‌పై ముగ్గురు ఉండి చికిత్స పొందాల్సిన పరిస్థితి తయారైంది. ఫార్మసీలో కూడా కేవలం ఒకే ఫార్మ సిస్ట్‌ ఉండి రోజూ దాదాపు 1000 మందికి మందు లు ఇవ్వడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని తెలిసింది. రోజూ దాదాపు 1200 మందికిపైగా ఓపీ జరుగుతున్న ఈ ఆస్పత్రిలో తాగునీటి కోసం దాదాపు రూ.15 లక్షలతో ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న ట్లు అధికారులు తెలిపారు.


9rct14.gifడాక్టర్‌ కోసం వేచి ఉన్న రోగులు - ఖాళీగా దర్శనమిస్తున్న డాక్టర్‌ కుర్చీ

ఆస్పత్రిలో సమస్యలు

వంద పడకల ఆస్పత్రిలో కొన్ని రకాల మందుల కొరత ఉందని తెలిసింది. ల్యాబ్‌లో సిబ్బంది కొరత ఉంది. ఫార్మసీలో ముగ్గురికి గాను ఒకరే ఉన్నారు. ఆపరేషన్‌కు కావాల్సిన కిట్లు ఇంకా కొన్ని రావాల్సి ఉంది. రోగులకు బెడ్స్‌ పూర్తి స్థాయిలో అందుబా టులో లేవు. టైఫాయిడ్‌, మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలకు సంబంధించిన కిట్లు అందుబా టులో లేవు. సీబీపీ బ్లడ్‌ టెస్ట్‌ చేయడానికి సరిప డా పరికరాలు అందుబాటులో లేవు. వంద పడక ల ఆస్పత్రిలో వెంటిలేటర్స్‌ కూడా లేవు. గర్భిణులు ఆపరేషన్‌ కొరకు ఇంకా కొన్ని మందులు రావాల్సి ఉంది. చిన్నపిల్లలకు కూడా కొన్ని మందులు అందుబాటులో లేక బయట నుంచి తెప్పించుకుం టున్నారని తెలిసింది.

సిబ్బంది, బెడ్ల కొరత వాస్తవమే

ఈ ఆస్పత్రిలో కొంత సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. అంతేగాకుండా బెడ్స్‌ కూడా కొంత ఇబ్బందిగానే ఉన్నాయి. ఈ విషయంపై అధికారు లకు మేము ఇదివరకే రాసి పంపిచాము. వారం, పది రోజుల్లో మరో 20 బెడ్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు రూ.15 లక్షలతో కొత్త ఆర్‌ఓ ప్లాంట్‌ను వారం రోజుల్లో ప్రారంభం చేయబోతున్నాం. డయాలసిస్‌కి పూర్తి ఏర్పాటు చే శాం. త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నాం.

ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డేవిడ్‌ సుకుమార్‌

Updated Date - Oct 15 , 2024 | 11:29 PM