Share News

'Praja Darbar‘సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌’

ABN , Publish Date - Sep 21 , 2024 | 11:01 PM

జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

'Praja Darbar‘సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌’
రాయచోటి: ప్రజా దర్బారులో వినతిపత్రాలు స్వీకరిస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

చిన్నమండెం, సెప్టెంబరు 21: జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. శనివారం చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని తమ నివాసంలో మంత్రి ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ఏ ఒక్కరూ సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నా మన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నా రు. దీంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్‌ నిర్వహిస్తు న్నామన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చే సమస్యలన్నీ ఎప్పటికప్పుడు సం బంధిత అధికారులకు తెలియజేసి తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

ఓబులవారిపల్లె: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ అన్నారు. ప్రజా సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి, బీజేీ ప, జనసేన నాయకులు తాతంశెట్టి నాగేంద్ర, జోగినేని మణి ప్రసంగించారు. సర్పంచ ఎర్రబాబు రవిరెడ్డి, ముక్కా సాయివికాస్‌రెడ్డి, టీడీపీ నాయకులు జనార్దననాయుడు, మండల మాజీ అధ్యక్షుడు వెంకటే శ్వర్‌రాజు, వాసుదేవరెడ్డి, కల్లా చలపతి, బొక్కసం చలపతి, కమతం నాగ రాజు, బీజేపీ నాయకులు పులపత్తూరు రామసుబ్బారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 11:01 PM