Home » Praja Darbar
సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఏపీఎస్ఆర్టీసీ నర్సీపట్నం డిపోలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ తన భర్త మరణించాడని, కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు బ్రెడ్ విన్నర్ స్కీమ్ వర్తింపజేస్తామని 2013లో యూనియన్‌తో జరిగిన అగ్రిమెంట్ అమలు చేయకపోవడంతో తమ కుటుంబం రోడ్డున పడిందని విశాఖకు చెందిన కె.రమాదేవి మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పోటెత్తుతున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట నివాసం వద్ద ఈ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరి సమస్య వింటూ పరిష్కారం చేస్తానని ఆయన హామీ ఇస్తుండటంతో ప్రతి ఒక్కరూ తమ సమస్యలు విన్నవించేందుకు బారులు దీరుతున్నారు.
జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
వైసీపీ నేతల బెదిరింపులు, భూ కబ్జాలు, అధికారుల అలసత్వంపై బాధితులు ప్రభుత్వ పెద్దలకు ఏకరవు పెట్టారు.
సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు పులివెందలు టీడీపీ ఇనఛార్జ్ బీటెక్ రవి అన్నారు.
భూ సమస్యలపై ఫిర్యాదులు పునరావృతమైతే చర్యలు తప్పవని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై అభిమానంతో సుదూర ప్రాంతాల నుంచి కలవడానికి వచ్చిన మహిళలపై రోప్ పార్టీ పోలీసులు దాష్టీకం చూపించారు. సుదూర ప్రాంతాల నుంచి జగన్‌ను కలిసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన అభిమానులపై ఇలా పోలీసులు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
Andhrapradesh: మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్భార్‌కు అర్జీదారులు వెల్లువెత్తున్నారు. ప్రజాదర్బార్‌కు వచ్చి పలువురు ఇస్తున్న అర్జాలను స్వీకరిస్తున్న మంత్రి వారి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామంటూ హామి ఇస్తున్నారు. ఈరోజు (శుక్రవారం) ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేష్‌ను అనంతపురం ఏఎస్పీగా పనిచేస్తున్న తియోపిల్లాస్ బంధువులు కలిశారు.
హైదరాబాద్‌లో ఏపీ క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ సంఘం ప్రతినిధులు పవన్‌కు అర్జీలు సమర్పించారు. తెలంగాణలో ఏపీ వాహనాలు తిరిగేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయనకు మెురపెట్టుకున్నారు. దీంతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబం గడవడం కూడా కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు అధికారం ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు.. బాధ్యతతో వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికే అని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నోసార్లు చెప్పారు.