వ్యక్తిగత పరిశుభ్రతతో అంటు వ్యాధుల నివారణ
ABN , Publish Date - Sep 16 , 2024 | 11:57 PM
వ్యకి ్తగత, పరిసరాల పరిశుభ్రతతో సీజనల్ వ్యాధుల వ్యాప్తి ఉధృతిని నివారించవచ్చని పీలేరులోని మలేరియా సబ్ యూనిట్ అధికారి విద్యాసాగ ర్ పేర్కొన్నారు.
పీలేరు, సెప్టెంబరు 16: వ్యకి ్తగత, పరిసరాల పరిశుభ్రతతో సీజనల్ వ్యాధుల వ్యాప్తి ఉధృతిని నివారించవచ్చని పీలేరులోని మలేరియా సబ్ యూనిట్ అధికారి విద్యాసాగ ర్ పేర్కొన్నారు. సీజనల్ వ్యా ధులు, వాటి నివారణకు చేప ట్టాల్సిన అంశాలను సోమవా రం ఆయన పీలేరు మండలం గూడరేవుపల్లె పంచాయతీ రామానాయక్ తాండాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధిగా కాచి చల్లార్చిన నీటిని తాగడంతో పాటు చెత్తను ఎక్కడిపడితే అక్కడ పడేయక పోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. వ్యర్థాల కారణంగా పుట్టుకొచ్చే ఈగలు వాలిన ఆహారపదార్థాలు భుజించడం వల్ల కలరా, అతిసారా, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ కొండయ్య, సిబ్బంది శ్రీనివాసులు, అనిత, తదితరులు పాల్గొన్నారు.