ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం
ABN , Publish Date - Sep 26 , 2024 | 11:56 PM
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యే యమని ఎమ్మెల్సీ కంచ ర్లశ్రీకాంత పేర్కొన్నారు.
బి.కొత్తకోట, సెప్టెంబరు 26: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యే యమని ఎమ్మెల్సీ కంచ ర్లశ్రీకాంత పేర్కొన్నారు. బుధవారం మండలం లోని బడికాయలపల్లి, బి.కొత్తకోట నగరపంచా యతీ ఆవరణలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మా ట్లాడుతూ సూపర్‌సిక్స్ హామీలను క్రమంగా అమలు చేస్తామన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైసీపీ హయాంలో అక్రమ కేసులలో ఇరుక్కున్న టీడీపీ కార్యకర్తలందరికీ విముక్తి లభిస్తుందన్నారు. జిల్లా పార్టీ అఽధ్యక్షుడు జగనమోహనరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. తంబళ్లపల్లె టీడీపీ నేత జయచంద్రారెడ్డి మాట్లాడుతూ సీయం హామీతో ఇండసి్ట్రయల్ కారిడార్ కోసం బి.కొత్తకోటలో 2172 ఎకరాలు, కురబలకోట మండలంలో 600 ఎకరాలు గుర్తించాము. 1350 కోట్లతో హంద్రీనీవా కాలువను విస్తరంచి 1100 టీఎంసీ ల నీళ్లు అందించాలన్న లక్ష్యంతో పనులను ఈ రోజు ప్రారంభించామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీనతాజ్, మునిసిపల్ కమీషనర్ పల్లవి, జనసేన ఇనచార్జ్ సాయి నాథ్, సమన్వయకర్త సీడ్ మల్లికార్జున నాయుడు, కుడుంశ్రీనివాసులు, చింతల కిరణ్‌రాయల్, గుత్తికొండ త్యాగరాజు, లోకనాధ్‌రెడ్డి, చిటికి శివా రెడ్డి, అధికారులు, సంఘమిత్రలు, తదితరులు పాల్గొన్నారు
ములకలచెరువులో: ములకలచెరువులో గురువారం ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత పర్యటించారు. పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట మండలాల్లో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తూ తంబళ్లపల్లె నియోజక వర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఇంటికి వచ్చారు. దీంతో టీడీపీ నేత జయచంద్రారెడ్డి ఎమ్మెల్సీ శ్రీకాంతకు స్వాగతం పలికి సన్మా నించారు. అలాగే ప్రచార సమన్వయకర్త సీడు మల్లికార్జుననాయుడు, టీడీపీ నేత మంత్రి గిరిధర్‌రెడ్డిలు కూడా ఎమ్మెల్సీని సన్మానించారు.
పెద్దమండ్యం లో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
పెద్దమండ్యం, సెప్టెంబరు 26: పెద్దమండ్యంలోని నాలుగు రోడ్లకూడలిలో గురువారం సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవనకల్యాణ్ చిత్రపటాలకి టీడీపీ, కూటమి నేతలు క్షీరాభిషేకం చేశారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాల్లో భాగంగా మండల టీడీపీ అధ్యక్షుడు జిట్టా వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కేక్‌కట్ చేసి కూటమి నేతలు పంబరాలు జరుపు కున్నారు. టీడీపీ సీనియర్ నేత, రాజంపేట పార్లమెంట్ బీసీసెల్ అధ్యక్షు డు సురేంద్రయాదవ్ కూటమి నేతలు వేంపల్లి రఫీ, నారా శ్రీనివాసులు, బాను, శ్రీనివాసులు, పెద్దన్న, రఘునాధ, డీవీరమణ, రెడ్డిపీరా, రమేష్, నాగూరు మస్తానవలీ, అస్రఫ్, ప్రకాష్‌రెడ్డి, తిమ్మయ్య పాల్గొన్నారు.