Share News

కామాంధులను పదవుల నుంచి తొలగించండి

ABN , Publish Date - Oct 05 , 2024 | 12:17 AM

వైవీయూ ప్రతిష్టను ప్రజాప్రతినిధులు దిగజారుస్తున్నారని, ప్రజాప్రతినిధుల సిఫారసుతో నియ మి తులైన కామాంధులను ఆయా పదవుల నుంచి తక్షణం తొలగించాలని విద్యార్థి సం ఘాలు డిమాండ్‌ చేశాయి.

కామాంధులను పదవుల నుంచి తొలగించండి
ఆందోళన చేస్తున్న ఏఐఎ్‌సఎఫ్‌, ఏఐవైఎఫ్‌ ప్రతినిధులు

వైవీయూ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన

కడప (ఎడ్యుకేషన), అక్టోబరు 4: వైవీయూ ప్రతిష్టను ప్రజాప్రతినిధులు దిగజారుస్తున్నారని, ప్రజాప్రతినిధుల సిఫారసుతో నియ మి తులైన కామాంధులను ఆయా పదవుల నుంచి తక్షణం తొలగించాలని విద్యార్థి సం ఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ ఏరకు శుక్రవారం ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా కార్యదర్శి జి.వలరాజు, ఏఐవైఎఫ్‌ జిల్లాకార్యదర్శి గంగాసురేశ ఆధ్వర్యంలో వైవీయూ ప్రధాన గేటు ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైంగిక వేధింపులకు పాల్పడిన క్రిష్ణారెడ్డిని వీసీగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. మరో వైపు గతంలో లైంగిక వేఽధింపులకు పాల్పడిన రాంప్రసాద్‌రెడ్డిని రిజిసా్ట్రరుగా నియమించడం పనికమాలిన చర్య అన్నారు. తక్షణం వారిని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శివశంకర్‌, జి ల్లా ఉపాద్యక్షుడు చంద్ర, నాయకులు గణేశ, రాము తదితరులు పాల్గొన్నారు. కాగా.. లైంగిక వేధింపుల ఆరోపణలున్న రిజిస్ర్టారును తొలగించాలని ఏఐఎ్‌సయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జగదీశ, నాగరాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు ఏఐఎ్‌సయూ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వైవీయూ రిజిసా్ట్రరును తొలగించాలని లేదంటే పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హె చ్చరించారు.

Updated Date - Oct 05 , 2024 | 12:17 AM