గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు లేకుండా చూడాలి
ABN , Publish Date - Sep 20 , 2024 | 12:00 AM
గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్త కుండా చర్యలు చేపట్టాలని డీపీవో ధనలక్ష్మీ, సీఈవో జీవీ రమణారెడ్డిలు పేర్కొన్నారు.
కురబలకోట, సెప్టెంబరు 19: గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్త కుండా చర్యలు చేపట్టాలని డీపీవో ధనలక్ష్మీ, సీఈవో జీవీ రమణారెడ్డిలు పేర్కొన్నారు. గురువారం మండలంలోని అంగళ్లులో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా పాల్గొ న్న వారు మాట్లాడుతూ పంచాయతీని ఆదర్శవంతంగా తీర్చిదిద్ధడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి పారిశుధ్యం తలెత్తకుండా ముందస్తు ప్రణాళి కలను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. వ అనంతరం అధికారులు, విద్యార్థులు స్వచ్ఛ అంగళ్లు కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజ, ఎంపీడీవో హరినారాయణ, పంచాయతి కార్యదర్శి శేషగిరి తదితరులు పాల్గొన్నారు.
మదనపల్లెను పరిశుభ్రంగా ఉంచుదాం
మదనపల్లె టౌన, సెప్టెంబరు 19: స్వచ్ఛత హి సేవా కార్యక్ర మంలో భాగంగా ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు మద నపల్లె పట్టణాన్ని పరిశుభ్రం గా ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల చేత మున్సిపల్ కమిషనర్ ప్రమీల ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్టోబరు 2వ తేదీ వరకు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం మూడు అంశాలపై పారిశుధ్య కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దమండ్యంలో: పెద్దమండ్యం మండలంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు భాగంగా గురువారం గ్రామాలలో పారిశుధ్య పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిజ్ఞ చేశారు. గ్రామ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, ఉపాధ్యాయు లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కలకడలో:ప్రజలందరి సహకారంతో గ్రామాల్లో సంపూర్ణ స్వచ్ఛత సాధ్యమవుతుందని ఎంపీడీవో పరమేశ్వరరెడ్డి అన్నారు. స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా మండలంలో వివిధ కార్యక్రమాలు చేప ట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈవోఆర్డీ లతీప్‌ఖాన, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
రామసముద్రంలో: ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని తద్వా రా పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మండల పరిషత పరిపాలనా అధికారి రమణ పేర్కొన్నారు. మండ లంలోని చొక్కాండ్లపల్లె పంచాయతీలో గురువారం నిర్వహించిన స్వచ్చ తాహి సేవా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి జి.రెడ్డిశేఖర్, గోవర్దనరాజు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తంబళ్లపల్లెలో : గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పరిస రాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ స్వఛ్చ భారతలో అంద రం భాగస్వాములవుదామని ఎంపీడీవో సురేంద్రనాథ్ పేర్కొన్నారు. స్వఛ్చతాహే కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఈవోపిఆర్డీ దిలీప్‌కుమార్, సచివాలయ సిబ్బందితో కలసి స్వఛ్చభారత ప్రతిజ్ఞ చేశారు. సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ములకలచెరువులో: ములకలచెరువులో గురువారం స్వచ్చత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. అధికారులు, వైద్య సిబ్బం ది స్థానిక జడ్పీ హైస్కూల్ విద్యార్ధులతో కలిసి బస్టాండు సర్కిల్ వరకు ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటరమణ, ఈవోఆర్డీ మోహనప్రతాప్, ఆర్‌డబ్యుఎస్ ఏఈ బాలాచంద్రాచారి పాల్గొన్నారు.