Share News

విద్యార్థులు నాయకత్వ లక్షణాలతో ముందుకెళ్లాలి

ABN , Publish Date - Sep 19 , 2024 | 11:53 PM

విద్యార్థులు నాయకత్వ లక్షణాలతో మందుకెళ్లాల ని మదనపల్లె సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ పేర్కొన్నారు.

విద్యార్థులు నాయకత్వ లక్షణాలతో ముందుకెళ్లాలి
కస్తూరిభా పాఠశాలలో భోజనం చేస్తున్న సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌

నిమ్మనపల్లి, సెప్టెంబరు 19: విద్యార్థులు నాయకత్వ లక్షణాలతో మందుకెళ్లాల ని మదనపల్లె సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ పేర్కొన్నారు. గురువారం మండలంలోని ముష్టూరు పంచాయతిలో గల కస్తూరి బా పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠ శాలలోని రికార్డులను పరిశీలించి సిబ్బం దికి తగు సూచనలు ఇచ్చారు. అనంతరం హాస్టల్‌ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సరుకులపై ఆరా తీశారు. అలాగే విధ్యార్థి నులకు వండిన భోజనం తిని బాగా వండారని కితాబిచ్చారు. కాగా విద్యార్థినుల క్లాస్‌ రూమ్‌లకు వెళ్లి పలు పాఠ్యాశాలపై అడిగి తెలుసుకొన్నారు. ప్రస్తుతం హాస్టల్‌కు ప్రహరీ లేదని ప్రిన్సిపాల్‌ మునివెంకటమ్మ ఆయన దృషికి తీసుకెళ్లారు దాంతో ఆయన సంబంధి త ఏఈ ద్వారా ఎస్టిమేషన వేయించి ప్రహరీ నిర్మిస్తామని తెలిపారు.

ఫ్రీహోల్డ్‌ భూముల రికార్డులను పరిశీలించిన సబ్‌కలెక్టర్‌

నిమ్మనపల్లె మండలంలోని స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని గురువారం సబ్‌కలెక్టర్‌ మేఘాస్వరూప్‌ తనిఖీలు చేపట్టారు. మండలంలోని పది పంచాయతీలలో కలిపి 1141 మంది లబ్దిదారుల ఫ్రీహోల్డ్‌ భూముల వివరాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గతంలో డీకెటీగా ఉన్న భూములను సెటిల్‌మెంట్‌ చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. అయితే మొదట విడతగా దరఖాస్తుచేసుకొన్న 1141మంది రైతులకు సంబంధించిన రికార్డులు సక్రమంగా ఉన్నాయా? లేదా? అని క్షుణ్ణంగా పరిశీలించాలని తహసీల్దార్‌ ధనంజేయులును ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రాంప్రసాద్‌ వీఆర్‌వోలు తదితరుల పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2024 | 11:53 PM