Share News

అన్నదాతను ఆదుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Sep 24 , 2024 | 12:03 AM

అన్నదాతను ఆదుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకే తమ ప్రభుత్వం పొలం పిలుస్తోంది కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని నియోజకవర్గ ఇనచార్జ్‌ బీటెక్‌ రవి అన్నారు.

అన్నదాతను ఆదుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
పులివెందులో పొలం పిలుస్తోంది పోస్టర్లను ఆవిష్కరిస్తున్న నియోజకవర్గ ఇనచార్జ్‌ బీటెక్‌ రవి

నియోజకవర్గ ఇనచార్జ్‌ బీటెక్‌ రవి

పులివెందుల టౌన, సెప్టెంబరు 23: అన్నదాతను ఆదుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకే తమ ప్రభుత్వం పొలం పిలుస్తోంది కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని నియోజకవర్గ ఇనచార్జ్‌ బీటెక్‌ రవి అన్నారు. సోమవారం పులివెందుల డివిజన వ్యవసాయ సహాయ సంచాలకులు ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మంగళ, బుధవారం వ్యవసాయాధికారులు, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారులు, అనుబంధ శా ఖల అధికారులు పొలాలను పరిశీలించి రైతులను కలిసి వారికి తగిన అవగాహన కల్పిస్తారన్నారు. ఉత్పత్తులకు సరైన మద్ధతు ధర కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేసిందన్నారు. రోజుకు రెండు గ్రామాల చొప్పున ఉదయం పొలాల క్షేత్ర సందర్శన, మధ్యాహ్నం గ్రామసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టె క్నికల్‌ వ్యవసాయాధికారి సునీల్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ అధికారులు చెన్నారెడ్డి, రమేశ, నాగలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2024 | 12:03 AM