Home » BTech Ravi
అవినాష్ రెడ్డి నీ మఖం అద్దంలో చూసుకో.. నీకు వైఎస్ వివేకానంద రెడ్డి ఫోటో కనిపిస్తోందంటూ బి టెక్ రవి వ్యంగ్యంగా అన్నారు. పులివెందుల రైతులు.. గుడ్డ లూడదీసి వైఎస్ జగన్ ముందు నిన్ను నిలబెట్టారంటూ వైఎస్ అవినాష్‌కు చురకలంటించారు.
వర్ర రవీంద్రరెడ్డి కేసులో వైసీపీ పెద్ద కుట్ర చేస్తున్నట్లు అర్థమవుతోందని బీటెక్ రవి అనుమానం వ్యక్తం చేశారు. రవీంద్రారెడ్డి ప్రాణాలకు వైసీపీ నేతలే హాని తలపెట్టి దాన్ని ఎన్డీయే ప్రభుత్వం, పోలీసులపై మోపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
Andhrapradesh: డైనమేట్లతో ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసింది వైఎస్ కుటుంబమే. కూటమి ప్రభుత్వం ఎక్కడ అక్రమ మైనింగ్ వ్యాపారం చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మట్కాను పులివెందుల నియోజకవర్గంలో కూకటివేళ్ళతో పేకళించడం జరిగిందని...
అన్నదాతను ఆదుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకే తమ ప్రభుత్వం పొలం పిలుస్తోంది కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని నియోజకవర్గ ఇనచార్జ్ బీటెక్ రవి అన్నారు.
హత్యలు చేయడం వల్లే ఈ రోజు పులివెందుల రాజకీయాల్లో వైఎస్ కుటుంబం మనగడ కొనసాగుతోందని తెలుగుదేశం పులివెందుల ఇన్‌చార్జ్ బీటెక్ రవి (BTech Ravi) ఆరోపించారు. వాళ్ల రాజకీయ పునాదే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పుట్టిందని విమర్శించారు.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య, పెండింగ్ కేస్‌లపై ఎవరూ మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో టీడీపీ నేత బీటెక్ రవి అప్పీల్ చేశారు. అప్పీల్‌ను లంచ్ మోషన్ రూపంలో సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ కోర్టు ముందుంచారు. ఈ అప్పీల్‌పై రేపు ఉదయం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.
మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసుకు సంబంధించి జై భీమ్ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి (Dastagiri) కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), కాంగ్రెస్ చీఫ్ షర్మిల (YS Sharmila), వివేకా కూతురు సునీతారెడ్డి వాడుకుంటున్నారని సోమవారం నాడు ఎలక్షన్ కమిషన్ (Election Commission)కి దస్తగిరి ఫిర్యాదు చేశారు.
Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య జరగడం పులివెందుల వాసిగా సిగ్గుపడుతున్నా అని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి అన్నారు. వైఎస్ వివేకా 5 వ స్మారకోత్సవ సభకు బీటెక్ రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వివేకాపై నేను పోటీచేసి గెలిచినప్పటికి ఆయన నాతో చాలా బాగా మాట్లాడే వారు’’ అని గుర్తుచేశారు.
Andhrapradesh: పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిన్న (సోమవారం) మెడికల్ కాలేజీని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి స్పందిస్తూ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... పులివెందులలో మెడికల్ కాలేజీకి కేంద్రం అనుమతి లేదని తెలిపారు. నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కాలేజీని సీఎం జగన్ రెడ్డి ప్రారంభించారని విమర్శించారు.
Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసుపై సాక్షిలో వచ్చిన కథనంపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వివేకా కేసులో తన ప్రమేయం లేదని నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధమని స్పష్టం చేశారు. వివేక కేసులో అవినాష్ కూడా నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.