గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయం
ABN , Publish Date - Oct 17 , 2024 | 11:50 PM
ప్రతి గ్రామంలో మౌలికవసతులను కల్పనే ప్రభుత్వ ధ్యేయమని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత జయచంద్రారెడ్డి పేర్కొన్నారు.
కురబలకోట, అక్టోబరు 17: ప్రతి గ్రామంలో మౌలికవసతులను కల్పనే ప్రభుత్వ ధ్యేయమని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని ముదివేడు, దాదంవారిపల్లె, తెట్టు, మట్లివారిపల్లె, నందిరెడ్డిగారిపల్లె తదితర గ్రామాలలో పల్లెపం డుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నియోజక వర్గంలోని మారుమూల గ్రామాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటుగా అన్ని వసతులను కల్పించను న్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగయ్య, టీడీపీ సమన్వయకర్త మల్లికార్జున నాయుడు, అయూబ్‌బాషా, డిఆర్ వెంకట్రమణారెడ్డి, వై.జి సురేంద్ర, రమణ, బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
కలకడలో:మారుమూల గ్రామాల అభివృ ద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా గురువారం ఎను గొండపాలెం, దిగువతాండ, కదిరాయచెరు వు పంచాయతీలో సీసీ రోడ్లకు శంకు స్థాపన చేశారు. ఇందుకు గానూ రూ.12.5 లక్షలతో నాలుగు పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అబ్దుల్ రహీం, చెన్నకేశవులు, సర్పంచ లక్ష్మీప్రసన్న, నాయ కులు శేఖర్‌నాయుడు, శ్రీనివాసులనాయుడు, విశ్వనాథంశెట్టి, గౌరవం శ్రీనివాసులు, ఆంజినేయులు, శ్రీనివాసులు, చంద్రశేఖర్‌నాయక్, శ్రీధర్‌నాయక్, బొంబాయి నాయక్ తదితరులు పాల్గొన్నారు.