విగ్రహ ప్రతిష్ఠను అడ్డుకున్న పోలీసులు
ABN , Publish Date - Sep 01 , 2024 | 11:29 PM
మండలంలోని మద్దయ్యగారిపల్లె లోని ఓ ప్రభుత్వ స్థలంలో చేపట్ట తలచిన ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం అనుమతుల్లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. వి
పెద్దతిప్పసముద్రం సెప్టెంబర్ 1 : మండలంలోని మద్దయ్యగారిపల్లె లోని ఓ ప్రభుత్వ స్థలంలో చేపట్ట తలచిన ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం అనుమతుల్లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠకు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు వస్తార ని నిర్వాహకులు మద్దయ్యగారిపల్లెలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశానుసారం గ్రామంలో 144 సెక్షన అమలులో ఉందని ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకుడైన మద్దయ్యగారిపల్లె హరిని అదుపులోకి తీసుకుని పీటీ ఎం పోలీస్ స్టేషనకు తరలించారు. అనంతరం పీటీఎం పోలీసులు అక్కడికి చేరుకుని అక్కడ ఉన్న షామియానాలను తొలగించారు. పూజారులను, భజంత్రీలను సైతం పోలీసులు అనుమతించలేదు. పెద్ద ఎత్తున గ్రామస్థులు అక్కడికి చేరుకుని గ్రామంలో పూజా కార్యక్రమాలను, విగ్రహ ప్రతిష్ఠలను ఎలా అడ్డుకుంటారని వాదిం చారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూమిలో విగ్రహ ఏర్పాట్లు చేసుకునేం దుకు అనుమతులు తీసుకోకుండా ఎలా పడితే అలా చేయడం చట్టరీత్యా నేరమని ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతులు తీసుకున్న తరువాత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని అధికారులు తేల్చి చెప్పడం, నిర్వాహకులను పోలీస్ స్టేషనకు తరలిం చడంతో సమస్య సర్దుమణిగింది. నిర్వాహకులను స్టేషనకు తీసుకెళ్లి వారితో చర్చించి ఆతరువాత వారిని విడిచి పెట్టారు. రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లి అనుమతులను తీసుకున్న తరువాత విగ్రహా న్ని ఏర్పాటు చేసుకోవాలని అధికారులు తేల్చి చేప్పారు.