Share News

భవనాల నిర్మాణంలో వేగం పెంచాలి

ABN , Publish Date - Aug 28 , 2024 | 11:35 PM

మదనపల్లె ప్రభుత్వ మెడికల్‌ కాలేజి భవనాల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఏపీఎంఎ్‌సఐడీసీ ఎస్‌ఈ ఆనందరెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం స్థానిక సర్వజన బోధనాస్పత్రి పై అంతస్థులో నిర్మించిన కొత్త భవనాలను ఎస్‌ఈ పరిశీలించారు.

భవనాల నిర్మాణంలో వేగం పెంచాలి
మెడికల్‌ కాలేజి భవన నిర్మాణాలపై సూచనలిస్తున్న ఏపీఎంఎ్‌సఐడీసీ ఎస్‌ఈ ఆనందరెడ్డి

ఏపీఎంఎ్‌సఐడీసీ ఎస్‌ఈ ఆనందరెడ్డి

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 28: మదనపల్లె ప్రభుత్వ మెడికల్‌ కాలేజి భవనాల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఏపీఎంఎ్‌సఐడీసీ ఎస్‌ఈ ఆనందరెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం స్థానిక సర్వజన బోధనాస్పత్రి పై అంతస్థులో నిర్మించిన కొత్త భవనాలను ఎస్‌ఈ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడక్కడా మిగిలిపోయిన ప్యాచ్‌ వర్కులను గుర్తించి వెంటనే పూర్తి చేయాలని ఇంజనీర్లను అదేశించారు. అనంతరం మెడికల్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జమున అధికారులతో సమావేశమయ్యారు. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఇచ్చిన గడువులోపు ఏయే నిర్మాణ పనులు పూర్తి చేయాలో ప్రిన్సిపాల్‌ను అడిగి నమోదు చేసుకున్నారు. ఎన్‌ఎంసీకి అనుమతికి అవసరమైన నిర్మాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. 80 అదనపు పడకల గదుల కోసం నిర్మాణాలు చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. వీటిని డీఐఈసీ భవనంపై నిర్మించేందుకు పరిశీలిస్తామన్నారు. ఐసీయూ విభాగానికి అదనంగా 60 పడకలు అవసరమని ప్రిన్సిపాల్‌ ప్రతిపాదనలపై నివేదికలను తీసుకుంటామన్నారు. అనంతరం ఆరోగ్యవరం వద్ద నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజి భవనాలు, బోధనా తరగతుల భవనాలు, ల్యాబ్‌లు, విద్యార్థుల హాస్టళ్ల నిర్మాణాలను ఎస్‌ఈ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎ్‌సఐడీసీ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2024 | 11:35 PM