రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు
ABN , Publish Date - Sep 20 , 2024 | 12:14 AM
యురేనియం టె యిలింగ్ పాండ్ నిర్వహణ లోపంతో నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేంత వర కు పోరాడుతామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి అన్నారు.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి
వేముల, సెప్టెంబరు 19: యురేనియం టె యిలింగ్ పాండ్ నిర్వహణ లోపంతో నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేంత వర కు పోరాడుతామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి అన్నారు. గత సోమవారం యురేనియం కర్మాగారం నుం చి వ్యర్థాలను టెయిలింగ్ పాండ్‌కు తరలించే పైప్‌లైన లీకేజీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం పొ లంలోని కెమికల్ వ్యర్థాలను ఎలాగైనా రె వెన్యూ, పోలీసుల సహకారంతో తొలగించాలని చూస్తున్నారని సమాచారం తెలుసుకున్న కేకే కొట్టాల గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. మబ్బుచింతలపల్లె మాజీ సర్పంచు శ్రీనాథ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారధిరెడ్డికి తెలిపారు. ఆయన పైప్‌లైన లీకేజీ ప్రాంతానికి వచ్చి మాట్లాడుతూ టెయిలింగ్ పాండ్‌నుంచి వస్తున్న దు మ్ము ధూళితో కేకే కొట్టాల ప్రజలు చర్మ, శ్వాస సంబంధిత వ్యాధుల తో బాధపడుతున్నారన్నారు. టెయిలింగ్ పాండ్ వల్ల వ్యవసాయ బోర్లలో నీరు కలుషితం కావడంతో కొట్టాలు ప్రాంతమంతా బీడు ప్రాంతంగా మారిందన్నారు. వ్యర్థాలను తరలించే పైపు లు నిత్యం లీకేజీ కావడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. తక్షణం పైపు లీకేజీ వల్ల కెమికల్ బురద వెళ్లిన వ్యవసాయ పొలాలను యురేనియం అధికారులు స్వాధీనం చేసుకొని ఆ రైతులకు న్యా యం చేయాలన్నారు. లేకుంటే పోరాటం తప్పదని అధికారులను హెచ్చరించారు.