పల్లెతల్లికి పండగొచ్చింది
ABN , Publish Date - Oct 14 , 2024 | 11:15 PM
మన జాతిపిత మహాత్మా గాంధీ మాటను ఇప్పుడు తప్పక ప్రస్తావించుకోవాల్సిందే.. ఎందుకంటే నాడు గాంధీతాత కన్న గ్రామస్వరాజ్యం కల నేడు నెరవేరబోతున్నందుకు..
పులివెందుల టౌన, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : మన జాతిపిత మహాత్మా గాంధీ మాటను ఇప్పుడు తప్పక ప్రస్తావించుకోవాల్సిందే.. ఎందుకంటే నాడు గాంధీతాత కన్న గ్రామస్వరాజ్యం కల నేడు నెరవేరబోతున్నందుకు.. కూటమి ప్రభుత్వం గాంధీజీ ఆశయాలను నెరవేర్చనుంది. అన్ని గ్రామాల్లో మౌలిక వసతు లు కల్పించాలనే వజ్ర సంకల్పంతో అందుకు అవసరమైన నిధులు సమకూర్చి పనులు ప్రారంభిస్తోంది. ఇంతవరకు అరకొర వసతులతో అల్లాడిన నా పల్లెతల్లికి పండగొచ్చింది.. ఊరూరా పల్లెపండుగ పనులు సందడి చేస్తున్నాయి.. టీడీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని నియోజకవర్గ ఇనచార్జ్, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాధరెడ్డి (బీటెక్ రవి) అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్లెపండగ, పంచాయతీ వార్షికోత్సవాల్లో భాగంగా సోమవారం పులివెందుల మండలంలోని ఎర్రిపల్లి గ్రామంలో పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రతి గ్రామంలో మౌలిక వసతులు పూర్తిగా కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రతి ఏడాది గ్రామసభ నిర్వహించుకుని అందులో గ్రామానికి కావాలసిన అత్యవసర పనులను ప్రజలందరూ కలిసి తీర్మానం చేసుకుని ఒకదాని తరువాత ఒకటి పూర్తి చేస్తామన్నా రు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4500 కోట్ల నిధులతో వేల కిలోమీటర్లు సిమెంటు రోడ్లు ఎనిమిది లక్షల మంది కుటుంబాలకు వంద రో జుల పని, 25వేల గోకులాల నిర్మాణాలు తదితర అభివృద్ధి, నిర్మా ణ పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి ఏడాది గ్రామానికి మౌలిక వసతులన్నింటినీ కల్పిస్తామన్నారు.
వైసీపీలో ఉత్సవ విగ్రహాల్లా సర్పంచులు
గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల్లో అభివృద్ధి జరగలేదని గ్రామ సర్పంచలను ఉత్సవ విగ్రహాలుగా గత సీఎం జగనమోహనరెడ్డి చేశారని బీటెక్ రవి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి గ్రామంలో గ్రామ స్వరాజ్యం తీసుకువస్తామన్నారు. అందులో భాగంగానే 4500 కోట్ల నిధులతో మౌలిక వసతుల కల్పనను ప్రతి గ్రామంలో కల్పించడంలో భాగంగా నిధులు మంజూరయ్యారన్నారు. మండల ఇనచార్జ్ మారెడ్డి జోగిరెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, వెంకటనారాయణరెడ్డి, భాస్కర్‌రెడ్డి., చెన్నకేశవరెడ్డి తదితర గ్రామ నాయకులు, కూటమి నాయకులు, అధికారులు, సంబంధిత అ ధికారులు పాల్గొన్నారు.