Share News

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Aug 31 , 2024 | 11:48 PM

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మదనపల్లె మండలంలో పింఛన్లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే షాజహానబాషా బి.కొత్తకోటలో పింఛన్లు పంపిణీ దృశ్యం

మదనపల్లె టౌన, ఆగస్టు 31: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు నెలలో పంపిణీ చేయాల్సిన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీని ఒక రోజు ముందుగానే పంపిణీ చేయడం పేదల ప్రభుత్వం అనడానికి ఇదే నిదర్శనమన్నారు. మదనపల్లె నియోజకవర్గంలోని మద నపల్లె రూరల్‌, పట్టణం, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల్లో ఎమ్మెల్యే షాజహానబాషా చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ కార్యక్ర మం పండుగలా నిర్వహించారు. శనివారం ఉదయమే మదనపల్లె మం డలంలోని కొత్తవారిపల్లె పంచాయతీ దిగువ కాశీరావుపేట గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే పోతబోలు, మద నపల్లె పట్టణంలోని రామిరెడ్డి లేఅవుట్‌, రాజానగర్‌, ముజీబ్‌నగర్‌, శివాజీనగర్‌, గొల్లపల్లె, రామ్‌నగర్‌, ప్రాంతాల్లో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు ముందుగానే లబ్ధిదా రులకు పింఛన్లను పంపిణీ చేస్తోందన్నారు. దీని వలన ఒకే నెలలో రెండు సార్లు పింఛన్లను పంపిణీ చేసినట్లు అయ్యిందని గుర్తుచేశారు. దీంతో పాటు పట్టణంలోని టీడీపీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ తులసి, రామ కృష్ణతో పాటు మండలంలోని టీడీపీ సర్పంచలు, పలు గ్రామాలు, మున్సిపల్‌ వార్డులో టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. మదనపల్లె మండలంలో 14,167 మంది లబ్ధిదారులకు గాను సాయంత్రం 6గంటలకు 96.56శాతం పింఛన్లను పంపిణీ చేయగా, రామసముద్రం మండలంలో కూడా 96.16 శాతం పింఛన్లను పంపిణీ చేశారు. మదనపల్లె మున్సిపాలిటిలో 11,016 పింఛన్లకు గాను 97.53 శాతం పింఛన్లను పంపిణీ చేశారు. మదనపల్లె ఎంపీడీవో భానుప్ర సాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

పీలేరులో: మండలంలో టీడీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు శనివారం ఉదయమే పింఛన లబ్ధిదారులను నిద్ర లేపి వారికి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు అందజేశారు. సెప్టెంబరు 1 ఆదివారం కావడంతో ముందుగానే పింఛన్లు అందజేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అటు టీడీపీ నాయకులు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం శనివారం సాయంత్రానికి 97 శాతం పంపిణీ పూర్తి చేసినట్లు ఎంపీడీవో ఉపేం ద్ర రెడ్డి తెలిపారు. పీలేరు మండలంలో 9835 పింఛన్లు ఉండగా 9525 పింఛన్లు పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమంలో ఎక్కడిక్కడ టీడీపీ నాయకులు పాల్గొని విజయవంతం కావడానికి దోహదపడ్డారు.

నిమ్మనపల్లిలో: మండలంలోని కొండయ్యగారిపల్లి నిమ్మనపల్లి అగ్రహా రం, వెంగంవారిపల్లి, తవలం పంచాయతీలల్లో ఎన్టీఆర్‌ భరోసా పింఛన లను స్థానిక ఎమ్మెల్యే షాజహానబాషా శనివారం పంపిణీ చేశారు. ఎన్నికల్లో వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, ధీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన మొత్తాన్ని అధికారంలోకి రాగానే ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదే అని తెలిపారు. ఎంపీడీవో రమేష్‌ మాట్లాడుతూ శనివారానికి 98శాతం పింఛనలను పంపిణీ చేశామని మిగిలిన వారికి 2వతేదీ పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటరమణ, జనసేన మండల ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

పెద్దమండ్యంలో: ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పింఛనలు పం పంపిణీ చేసి చరిత్ర సృష్టించదని టీడీపీ నేతలు పేర్కొన్నారు. పెద్దమం డ్యం మండలం లో శనివారం అధికారులు, కూటమి నేతలతో కలసి పింఛనలు పంపిణీ చేశారు. ఎంపీడీవో శ్రీధర్‌రావు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, కూటమి నేతలు పాల్గొన్నారు.

తంబళ్లపల్లెలో: తంబళ్లపల్లె మండలంలో 6244 పింఛనుదారులు ఉం డగా శనివారం సాయంత్రానికి 6153మందికి 98శాతం పింఛన్లు పంపి ణీ చేసినట్లు ఎంపీడీవో సురేంద్రనాథ్‌ తెలిపారు. సచివాలయ సిబ్బంది ఉదయం 5:30ల నుంచే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలసి ఆయా గ్రామాల్లో ఇళ్ల వద్దకే వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. 31వ తేదీ పింఛను అందుకోలేని వారికి ఆది, సోమవారాల్లో పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ, జనసేన, బీజేపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గుర్రంకొండలో:ఎన్టీఆర్‌ భరోసా పింఛనల పంపిణీ కార్యక్రమాన్ని శని వారం టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఇందులో భాగంగా గుర్రంకొండ పట్టణం, తరిగొండ, చెర్లోపల్లె, ఎల్లుట్ల, మర్రిపాడు తదితర గ్రామాల్లో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మండలంలో మొత్తం 6093 మంది లబ్ధిదారులకు గానూ 5914 మందికి పింఛనలను 97 శాతం అందజేసినట్లు ఎంపీడీవో వెంకటేశులు తెలిపారు. కార్యక్ర మంలో నాయకులు జగదీష్‌కుమార్‌, చలమారెడ్డి, ఎల్లుట్ల మురళీ, రామయ్య, రంజిత, శేఖర్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

కలకడలో:మండలంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛనల పంపిణీ 97 శాతం జరిగినట్లు ఎంపీడీవో పరమేశ్వరరెడ్డి తెలిపారు. అన్ని పంచాయితీ పరి ధిలో ఉదయం నుంచే సచివాలయల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి సొమ్మును అందజేశారు. మండలంలో 5529 మందికి గానూ 5366 మందికి పింఛనలు అందించినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో పింఛనల పంపిణీలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

వాల్మీకిపురంలో: దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒకే నెలలో రెండు సార్లు పింఛన్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికే దక్కుతుందని మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా శనివారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. టీడీపీ, జనసేన, బీజే పీ నాయకులు, కార్యకర్తలు ఉదయం 6 గంటల నుంచే సచివాలయ ఉద్యోగులతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశా రు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వెలిగట్ల రమణ, మాజీ సర్పంచ రాజేంద్రాచారి, నాయకులు కోసూరి రమేష్‌, చంద్రమౌళి, పీవీ నారాయణ, రెడ్డెప్ప, శంకర, కేకే నాయులు, రాజగోపాల్‌ పాల్గొన్నారు.

ములకలచెరువులో: ఒకే నెలలో రెండు సార్లు ఎన్టీఆర్‌ భరోసా పింఛ న్లు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికే దక్కుతుందని టీడీపీ మండల అధ్యక్షుడు పాలగిరి సిద్ధా పేర్కొన్నారు. మండలంలోని పాత ములకలచెరువులో శనివారం లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. లాగే దేవళచెరువులో టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, మాజీ వైస్‌ ఎంపీపీ నరసిం హారెడ్డి ఫింఛన్లను పంపిణీ చేశారు. అన్ని గ్రామాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఫింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు.

పెద్దతిప్పసముద్రంలో: పెద్దతిప్పసముద్రం మండలంలో శనివారం ఉదయం 5 గంటల నుంచి సచివాలయ సిబ్బందిచే ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన లబ్ధిదారులకు ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు పంపిణీ చేసినట్లు ఎంపీడీవో కేఎన బాలాజీ పెర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మా ట్లాడుతూ ఎన్టీఆర్‌ భరోసా పింఛనలు 1వ తేదీన ఆదివారం రావడం తో ఒకరోజు ముందుగానే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నా యుడు ఆదేశానుసారం ఆయా గ్రామాల్లో సచివాలయ సిబ్బందిచే పంపిణీ చేశామన్నారు. ఒకే నెలలో రెండు సార్లు పింఛన లను పంపి ణీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం పింఛన తీసుకోని లబ్ధిదారులకు సోమవా రం పింఛన పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాలకు చెందిన కూటమి నేతలు పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో: ఎన్టీయార్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం శని వారం బి.కొత్తకోటలో పండుగలా జరిగింది. మండలవ్యాప్తంగా 288 క్లస్టర్లలో ఇనచార్జి అధికారులు, టీడీపీ-జనసేన నాయకుల ద్వారా లబ్ధి దారులకు పింఛన్ల సొమ్మ పంపిణీ చేశారు. కాండ్లమడుగుక్రాస్‌ లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీనతాజ్‌, బీరంగిలో మండల కన్వీనర్‌ నారాయణస్వామిరెడ్డి, బి.కొత్తకోటలో కుడుంశ్రీనివాసులు, జన సేన నాయకుడు కిరణ్‌రాయల్‌లు పంపిణీలో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా పర్వీనతాజ్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 1న ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే, ఒకేనెలలో రెండుసార్లు పింఛన ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబు దక్కించుకున్నారన్నారు. కాగా 7936 మందికి గాను 90శాతం పంపిణీ చేసినట్లు ఎంపీడీవో శంకరయ్య తెలిపారు.

రామసముద్రంలో:పేదలకు సంక్షేమ పథకాలు అందించి వారి కన్ను ల్లో ఆనందం చూడడమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఽధ్యేయ మని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు. మండలంలో శనివారం చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో అరికెల, మాలేనత్తం, మినికి, చొక్కాండ్లపల్లె, ఊలపాడు, ఎలవానెల్లూరు, చెంబకూరు పంచాయతీల లో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటో తేదీ ఆదివారం కావడంతో పింఛనదారులు, ఉద్యోగులు ఇబ్బంది పడకూడదని శనివారమే పింఛ న్లు పంపిణీ చేసి ఒకనెలలో రెండు సార్లు పింఛన పంపిణీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని కొనియాడారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌గౌడు, మాజీ జడ్పీటీసీ శివశంకర్‌, హైస్కూల్‌ కమిటీ అధ్యక్షుడు కృష్ణప్ప, ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షుడు బాలాజి, అల్తాఫ్‌ ఒంటెల, బద్రినాథ్‌, పూలకుంట్ల శ్రీనివాసులు, ఈవోఆర్‌డీ సుధాకర్‌రెడ్డి, డీటీ శ్రీనివాసరావు, ఏపీవో గౌరీశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 11:48 PM