Share News

ఇళ్లకు వెళ్లిపోయారు...

ABN , Publish Date - Sep 03 , 2024 | 10:50 PM

ఇలాంటి పాఠశాలలో మా పిల్లలను చదవనీయమని, ఇక్కడ ఉండాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల నుంచి ఇళ్లకు తీసుకెళ్లిపోయారు.

ఇళ్లకు వెళ్లిపోయారు...
తమ పిల్లలను ఇంటికి తీసుకెళుతున్న తల్లిదండ్రులు

ఇలాంటి పాఠశాలలో మా పిల్లలకు చదువొద్దు

విద్యార్థినులను ఇళ్లకు తీసుకెళ్లిపోయిన తల్లిదండ్రులు

మూతపడ్డ అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాల

లక్కిరెడ్డిపల్లె, సెప్టెంబరు 3 : ఇలాంటి పాఠశాలలో మా పిల్లలను చదవనీయమని, ఇక్కడ ఉండాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల నుంచి ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. దీంతో మంగళవారం పాఠశాలకు తాళాలు పడ్డాయి. లక్కిరెడ్డిపల్లెలోని అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం బాలికపై లైంగిక దాడి సంఘటనతో గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థినులు భయబ్రాంతులకు గురయ్యారు. 5వ తరగతి విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపులను వసతి గృహంలో ఉన్న విద్యార్థినులు జీర్ణించుకోలేక, హాస్టల్‌లో ఉండలేక తమ తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలాంటి పాఠశాలలో ఉండనీయమని మంగళవారం 470 మంది విద్యార్థినులను వారి తల్లిదండ్రులు వచ్చి ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. దీంతో పాఠశాల మూతపడింది. ఈ విషయంపై విద్యార్థినుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇలాంటి క్రూరమైన ప్రిన్సిపాల్‌ ఉన్న ఈ పాఠశాలలో మా పిల్లలను చదివించలేమని తెలిపారు. అందరూ పల్లెటూర్ల నుంచి చదువుకోవడానికి వచ్చిన పిల్లలని ఇలాంటి పిల్లలను ఇలా మానసికంగా, లైంగికంగా వేధించడం మంచిది కాదన్నారు. ఇలాంటి ప్రిన్సిపాల్‌, ఆమె భర్తకు కఠిన శిక్ష విధించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.

Updated Date - Sep 03 , 2024 | 10:50 PM