Share News

మద్యం షాపులకు పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ

ABN , Publish Date - Oct 06 , 2024 | 12:05 AM

మద్యం షాపులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్‌ సీఐ చెన్నారెడ్డి తెలిపారు.

మద్యం షాపులకు పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ
మాట్లాడుతున్న ఎక్సైజ్‌ సీఐ చెన్నారెడ్డి

పులివెందుల టౌన, అక్టోబరు 5 : మద్యం షాపులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్‌ సీఐ చెన్నారెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన ఎక్సైజ్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 1న మద్యంషాపులకు సంబంఽధించి నోటిఫికేషన విడుదలైం దన్నారు. పులివెందుల ప్రాంతంలోని పలు మండలాలకు 16 షాపులు మం జూరయ్యాయని, అందులో పులివెందులకు ఏడు, వేంపల్లె, వేముల 1, చక్రాయపేట 1, లింగాలకు రెండు షాపులు మంజూరయ్యాయన్నారు. మద్యం షాపుల్లో భాగంగా 50వేల కంటే జనాభా అధికంగా ఉన్న పులివెందుల, వేంపల్లెలకు 65 లక్షలు లైసెన్సు ఫీజు ఉంటుందన్నారు. మిగిలిన మండలాలకు రూ.55 లక్షలు లైసెన్సు ఫీజు ఉంటుందని, అప్లికేషన ఫీజు రూ.2 లక్షలు ఈఎండీ లేకుండా ఆనలైనలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తుకు సమయం ఉందన్నారు. 11వ తేదీ లాటరీ పద్ధతిలో జిల్లా పరిష్‌ కార్యాలయంలో కలెక్టరు ఆధ్వర్యంలో టెండర్లు డ్రా తీస్తామ న్నారు. ఆసక్తి గలవారు ఎవరైనా ఆనలైనలో మద్యంషాపులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అపోహలను నమ్మవద్దని ఆయన తెలిపారు.

Updated Date - Oct 06 , 2024 | 12:05 AM