Share News

UCIL గ్రామస్తుల నిరసనకు తలొగ్గిన యూసీఐఎల్‌

ABN , Publish Date - Sep 23 , 2024 | 11:30 PM

కేకే కొట్టాల గ్రామస్తుల నిరసనకు యురేనియం సంస్థ ఎట్టకేలకు తలొగ్గింది. యురేనియం బాధితులకు 12మందికి 5.62 ఎకరాలకు ఇవ్వాల్సిన సుమారు రూ.2,84,084ల పెండింగ్‌ బకాయిలను స్థానిక ఆర్డీఓకు అందించారు.

UCIL  గ్రామస్తుల నిరసనకు తలొగ్గిన యూసీఐఎల్‌
రైతుల పొలంలోని కెమికల్‌ బురదను తొలగిస్తున్న యంత్రాలు

వేముల, సెప్టెంబరు 23: కేకే కొట్టాల గ్రామస్తుల నిరసనకు యురేనియం సంస్థ ఎట్టకేలకు తలొగ్గింది. యురేనియం బాధితులకు 12మందికి 5.62 ఎకరాలకు ఇవ్వాల్సిన సుమారు రూ.2,84,084ల పెండింగ్‌ బకాయిలను స్థానిక ఆర్డీఓకు అందించారు. ఈనెల 16వ తేదీ యురేనియం పరిశ్రమ నుంచి కేకే కొట్టాల గ్రామ సమీపంలోని టెయిలింగ్‌ పాండ్‌కు వ్యర్థాలను తరలించే గొట్టపు పైపులు లీకైన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి కొట్టాల గ్రామస్థులు టెయిలింగ్‌ పాండ్‌ పైప్‌ల నిర్మాణానికి భూములు కోల్పోయిన రైతులకు ఇవ్వాల్సిన పెండింగ్‌ బకాయిలతో పాటు ఇచ్చిన ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని ఆందోళన చేపట్టారు. వీరికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారధిరెడ్డి, మాజీ సర్పంచు శ్రీనాథ్‌రెడ్డిలు మద్దతు ఇచ్చారు. న్యాయం చేసేంత వరకు పోరాడుతామన్నారు. లీకేజీ వల్ల కమికల్‌ బురదంతా వెళ్లిన రైతుల పొలాలను యురేనియం అధికారులు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అంతవరకు రైతుల పొలాల్లోకి వెళ్లిన కెమికల్‌ ఉరదను తొలగించేందుకు ఒప్పుకోమని.. బలవంతపు చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీచేశారు. దీంతో యురేనియం అధికారులు దిగివచ్చారు.

Updated Date - Sep 23 , 2024 | 11:30 PM