ఉర్దూ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి: రూటా
ABN , Publish Date - Sep 29 , 2024 | 11:49 PM
రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన (రూటా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్ డిమాండ్ చేశారు.
కడప (ఎడ్యుకేషన), సెప్టెంబరు 29 : రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన (రూటా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్ డిమాండ్ చేశారు. ఆదివారం కడప నగరంలోని సాలే నాగయ్య నగరపాలక ఉర్దూ ఉన్నత పాఠశాలలో రూటా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉర్దూ కాన్ఫరెన్స నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రూటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్బాల్ హాజరై మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నామన్నారు. గౌరవ అతిథిగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ సిరాజుద్దీన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉర్దూ మీడియం సబ్జెక్టులు, లాంగ్వేజ్, ఎస్‌జీటీ ఉపాధ్యాయుల స్కూలు కాంప్లెక్స్ సమావేశాలు యదావిఽధిగాపాత స్కూలు కాంప్లెక్స్ పాఠశాలల్లోనే కొనసాగించాలన్నారు. ఉపాధ్యాయ సర్దుబాటులో ఉర్దూ పాఠశాలకు బదిలీ చేసిన ఉర్దూ చదవని ఉపాధ్యాయులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డి మాం డ్ చేశారు. రూటా రాష్ట్ర డైరీవింగ్ చైర్మన హాజీ అబుదల్ హకీమ్‌సాహెబ్ హాజరై మాట్లాడుతూ సీఎంచంద్రబాబునాయుడు 1997లో ఉర్దూ స్పెషల్ డీఎస్సీ నిర్వహించి ఉర్దూ విద్యావ్యవస్థకు ఊపిరి పోశారన్నారు. 2001 వం దల సంఖ్యలో ఉర్దూ ప్రాథమిక పాఠశాలలు స్థాపించారని, అలాంటి మహోన్నత పథకాలు పునఃప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మస్తానవలి, ఆప్జల్‌బాషా, ముహమ్మద్ ఇర్షాద్, ముహమ్మద్ అయ్యుబ్, బెపారిఫకృద్దీన, జిల్లా నాయకులు హబీబుల్లా, ముహమ్మద్ దావూద్, అర్షద్‌బాషా, ఉర్ధూ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.