Share News

visakha steel plant విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:40 PM

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాల ను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్‌ చేస్తూ అఖిల పక్ష ట్రేడ్‌ యూనియనలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం పట ్టణంలోని నేతాజీ సర్కిల్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు.

visakha steel plant  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి
రాయచోటిలో రాస్తారోకో చేస్తున్న అఖిల పక్ష ట్రేడ్‌ యూనియన నేతలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల నేతలు

రాయచోటిటౌన, సెప్టెంబరు10: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాల ను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్‌ చేస్తూ అఖిల పక్ష ట్రేడ్‌ యూనియనలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం పట ్టణంలోని నేతాజీ సర్కిల్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భం గా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పీ. శ్రీనివాసులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు, సీపీఐ (ఎంఎల్‌) విశ్వనాధ్‌, ఎంఆర్‌పీఎస్‌ జాతీయ నాయకులు రామాంజనేయులు, రైతు సంఘాల జిల్లా ప్రధాన కార్య దర్శులు వంగిమళ్ల రంగారెడ్డి, బసిరెడ్డిలు మాట్లాడుతూ రూ.9 వేల కోట్ల పెట్టుబడికి 58 వేల కోట్ల డివిడెండ్‌ చెల్లించిన విశాఖ ఉక్కు పరిశ్రమను దొడ్డిదారిన ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ఇందులో భాగంగానే బ్లాస్ట్‌ ఫర్నేస్‌ రెండింటిని ఉద్దేశపూర్వకంగా మూసివేశారని, 75 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం నుంచి 30 లక్షల టన్నులకు స్టీల్‌ ఉత్పత్తి పడిపో నుందని తెలిపారు. దీంతో అనివార్యంగా నష్టాల్లోకి విశాఖ ఉక్కును నెట్టాలని బీజేపీ మోడీ ప్రభుత్వం భావిస్తోందని, రాష్ట్ర పార్లమెంట్‌ సభ్యులు బలంపై ఆధారపడి నడుస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరణ ప్రకటన చేయించా లని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవనకల్యాణ్‌ను డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కుకు గనులు కేటాయించి తమ చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలన్నారు. విశాఖ ఉక్కును వదులుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని, అవసరమైతే మరో అంతిమ పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిద్దిగాళ్ల శ్రీనివాసులు, సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షుడు ఏవీ రమణ, సుబ్రమణ్యంరాజు, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి సుమిత్రమ్మ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన జిల్లా అధ్య క్షుడు నేలపాటి శ్రీనివాసులు, నరసింహులు, వేణుగోపాల్‌రెడ్డి, మురళి, వెంకట్రమణ, ఆకార్స్‌ యూనియన నాయకులు చంద్ర, సీపీఐ (ఎంఎల్‌) నాయకులు పూసపాటి రమణ తదితరులు పాల్గొన్నారు.

రాజంపేట : రాజంపేట బైపాస్‌ ఎన్టీఆర్‌ సర్కిల్లో ఏఐటీయూసీ, సీఐటీ యూ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీ యూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎస్‌ రాయుడు, సీఐటీయూ జిల్లా కార్య దర్శి చిట్వేలి రవికుమార్‌ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు పరిశ్రమ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్‌, ఏఐటీయూసీ నేతలు సికిందర్‌, నాగేశ్వరరావు, రమణ, సురేష్‌, సుబ్రమణ్యం, నరసింహా, రాఘవేంద్ర, రవి, లోకేష్‌, ఆంజనేయులు,. లింగన్న, రంగన్న, బలరాం, కృష్ణ, విఠోబా, సీఐటీయూ ప్రసాద్‌, రమణ, మల్లి పాల్గొన్నారు.

రైల్వేకోడూరు: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలని, కడపలో ఉక్కు పరిశ్రమను స్థాపించాలని వామపక్షాల నేతలు తుమ్మ ల రాధాకృష్ణయ్య, సీహెచ చంద్రశేఖర్‌, పండుగోల మణి డిమాండ్‌ చే స్తూ రైల్వేకోడూరు ప్రధానదారిలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. విభజన చట్టం ప్రకారం కడపలో ఉక్కు పరిశ్రమను స్థాపింకపోతే దశలవారీగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రాస్తాకోరో విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. దార్ల రాజశేఖర్‌, శివయ్య, వెంకటేష్‌, మోడి సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:40 PM