Home » Strike
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాల ను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్ష ట్రేడ్ యూనియనలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం పట ్టణంలోని నేతాజీ సర్కిల్ వద్ద రాస్తారోకో నిర్వహించారు.
థానే జిల్లా బద్లాపూర్ లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై లైంగిక దాడుల ఆరోపణలపై ఈనెల 24న 'మహారాష్ట్ర బంద్'కు విపక్ష రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ పిలుపునకు ముంబై హైకోర్టు అడ్డుకట్టు వేసింది. బంద్ పిలుపునకు రాజకీయ పార్టీలు కానీ, వ్యక్తులు కానీ దూరంగా ఉండాలని శుక్రవారంనాడు ఆదేశాలు ఇచ్చింది.
అస్వస్థతకు గురైన విద్యార్థిని ఆస్పత్రికి తీసుకెళ్లడంలో వర్సిటీ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని, ఆ కారణంగానే అతడు మృతి చెందాడంటూ మల్లారెడ్డి వర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్ చేశారు. అంబేడ్కర్ కృషి వల్లనే భారతీయ రిజర్వ్ బ్యాంకు ఏర్పడిందని, అటువంటి మహనీయుని ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తే... సభలో ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లుగా ఉందని, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చ జరుగుతున్నట్లుగా లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.
గ్రూప్ 2,3 పోస్టులను పెంచాలని.. గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని పలు సంఘాలు.. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఏఐఎ్‌సఎఫ్ నేతలు చేపట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది.
గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలని.. డిసెంబరులో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి నిరుద్యోగులు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు.
మెదక్ జిల్లా కేంద్రంలో జంతువధకు సంబంధించి ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కోలిగడ్డకు చెందిన రాజ్‌అరుణ్ అనే యువకుడికి కడుపు, చేతిపై కత్తిపోట్లు పడ్డాయి. అతని వర్గీయులు వెళ్లి రాంనగర్లో కొందరిని పట్టుకోగా అక్కడా తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది.
వనదేవతల గద్దెల వద్ద పూజారులు ధర్నా చేశారు. వరంగల్‌లోని ధార్మిక భవనానికి సమ్మక్క సారలమ్మల పేరు పెట్టాలని, రెండేళ్లకోసారి జరిగే మహాజాతర ఆదాయం నుంచి మూడో వంతు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం మేడారం దేవస్థానం ప్రధాన గేటు ఎదుట అర్చక సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ప్రధాన పూజారి కొక్కెర రమేశ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నాకు దిగారు.
బల్దియా కాంట్రాక్టర్లు సమ్మెబాట పట్టారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో జీహెచ్ఎంసీ అధికారుల వైఖరిని నిరసిస్తూ పోరుకు దిగారు. ఇప్పటికే ఇచ్చిన డెడ్‌లైన్ (ఈనెల 18)లోగా బకాయిలు చెల్లించాలని కొన్ని నెలల క్రితం జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో నిర్వహణ పనులను నిలిపివేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు.