Home » Vizag steel plant
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కార్మికులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నా రు. ఉక్కు సంకల్పంతో వంద శాతానికి పైగా ఉత్పత్తి సాధించి తమ చిత్తశుద్ధిని, సత్తాను చాటుతున్నారు.
Kumaraswamy: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను మళ్లీ నెంబర్ వన్ చేయడంలో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. రెండు, మూడు నెలల్లో కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపుతామని చెప్పారు. ఈ వార్షిక ఏడాదికి పూర్తిస్థాయిలో ఉక్కు ఉత్పత్తి సాధన లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు.
కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస వర్మ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం ఉక్కు హౌస్‌లో కార్మిక సంఘాల నేతలతో సుమారు గంటపాటు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Vizag Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డి కుమార స్వామితో కలిసి ఆ శాఖ సహాయ మంత్రి బి. శ్రీనివాస వర్మ సందర్శించనున్నారు.
. ‘చంద్రబాబు 1997 నుంచి దావోస్ వెళ్తున్నారు. అక్కడ ఎప్పుడూ ఒప్పందాలు జరగవు. చర్చిస్తారు.. కంపెనీల ఆసక్తి మేరకు ఆ తర్వాత ఒప్పందాలు చేసుకుంటారు.
Srinivasa Varma: స్టీల్ ప్లాంట్‌లో మేనేజ్మెంట్ లోపాలు ఉన్నాయని... వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ను ఎంతో సాయం చేస్తున్నారని అన్నారు. సిల్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండాలని మోదీ భావిస్తున్నారని చెప్పారు.
‘‘మీరంతా అనుకున్నంత వేగంగా చేయలేకపోయిన పని ఒకటుంది! అది... పరిహారం ఇప్పించడం! అది నా చేతుల్లో ఉండే పని కాదు. కాబట్టి నేను కూడా కష్టపడాల్సి వస్తోంది. ఈ విషయంలో ఢిల్లీ మీద ఆధారపడాల్సి వస్తోంది.
‘విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.17,000 కోట్ల అప్పులున్నాయని కేంద్రం చెబుతోంది.
గత ఆరు నెలలుగా ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఎప్పుడు కలిసినా విశాఖ ఉక్కుకు న్యాయం చేయాలని కోరారని, స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ఆర్థిక ప్యాకేజీ సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర కేబినెట్ రూ.11,500 కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.