టీడీపీలో చేరిన రాచవేటివారిపల్లి వైసీపీ సర్పంచ
ABN , Publish Date - Oct 20 , 2024 | 11:47 PM
మండలంలోని రాచవేటివారిపల్లి వైసీపీ సర్పంచ సుబ్రమణ్యం(మధు)తో పాటు వార్డు సభ్యులు ఆదివారం జరిగిన పల్లె పండుగ వారోత్పవాలలో భాగంగా స్థాని క ఎమ్యెల్యే షాజహానబాషా సమక్షంలో టీడీపీలో చేరారు.
ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుతున్న సర్పంచ సుబ్రమణ్యం, వార్డు సభ్యులు
అభివృద్ధి పథకాల అమలుతో టీడీపీలో చేరిక
నిమ్మనపల్లి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): మండలంలోని రాచవేటివారిపల్లి వైసీపీ సర్పంచ సుబ్రమణ్యం(మధు)తో పాటు వార్డు సభ్యులు ఆదివారం జరిగిన పల్లె పండుగ వారోత్పవాలలో భాగంగా స్థాని క ఎమ్యెల్యే షాజహానబాషా సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సంధర్బంగా రాచ వేటివారిపల్లి సర్పంచ సుబ్రమణ్యం మా ట్లాడుతూ తాను సర్పంచగా ఉన్నప్పటి నుంచి గ్రామంలో ఒక్క అభివృద్ధి పని చేయలేదని టీడీపీ అధికారంలోకి రాగానే పంచాయతీ అభివృద్ధిలో పరుగులు పెడుతోందన్నారు. ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశ్యంతో వైసీపీ వీడి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అనం తరం ఎమ్మెల్యే షాజహానబాషా సుబ్రమణ్యం, వార్డు సభ్యులు చక్రపాణిరెడ్డి, షమీల, చంద్రారెడ్డి, షరీప్‌లకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.
రూ.1.5కోట్లతో సీసీ రోడ్లకు భూమిఫూజ
నిమ్మనపల్లి మండలంలోని పది పంచాయతీల్లో ఉపాధి హామీ కింద మంజూరైన రూ.1.5 కోట్లతో సీసీ రోడ్ల పనులకు పల్లెపండుగ సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే షాజహానబాషా భూమి పూజ చేశారు. మొత్తం 40సీసీరోడ్లకు గాను రూ.1.5కోట్లలను ప్రభుత్వం కేయించిదన్నారు. కార్యక్రమం లో టీడీపీ నాయకులు సుధాకర్‌రావు, మల్లికార్జున, రెడ్డెప్పరెడ్డి చంద్రశేఖర్, ఆర్జే వెంకటేష్ మహ మ్మద్ రఫి, రాజన్న, ఎంపీడీవో పరమేశ్వర్‌రెడ్డి, పీఆర్ డీఈ శివశంకర్ పాల్గొన్నారు.