Share News

YS Sharmila: అన్న వైఎస్ జగన్‌ను కడిగిపారేసిన వైఎస్ షర్మిల

ABN , Publish Date - Oct 23 , 2024 | 09:23 PM

తోబుట్టువులైన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య వ్యక్తిగత వివాదానికి సంబంధించి మరికొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెల్లి, తల్లితో రాజీ కోరుతూ సెప్టెంబర్‌ నెలలో జగన్ లేఖ రాశారు.

YS Sharmila: అన్న వైఎస్ జగన్‌ను కడిగిపారేసిన వైఎస్ షర్మిల

కడప: కడప: తోబుట్టువులైన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య వ్యక్తిగత వివాదానికి సంబంధించి మరికొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెల్లి, తల్లితో రాజీ కోరుతూ సెప్టెంబర్‌ నెలలో జగన్ లేఖ రాశారు. అనినాశ్‌తో పాటు తన గురించి, భారతి గురించి మాట్లాడకూడదంటూ పలు షరతులు విధించారు. అయితే తల్లి, చెల్లి నుంచి స్పందన లేకపోవడంతో గతంలో తానే రాసిచ్చిన ఆస్తుల కోసం సెప్టెంబర్ 9న జగన్ కోర్టుకెళ్లారు. అన్న కేసు విషయం తెలిసి సెప్టెంబర్ 12న జగన్‌కు షర్మిల లేఖ రాశారు. 10 కీలకమైన అంశాలతో రాసిన లేఖలో జగన్‌ను ఆమె కడిగిపారేశారు.


షర్మిల లేఖలో ఏముందంటే?

జగన్ సూచించిన షరతులను వైఎస్ షర్మిల కొట్టిపారేశారు. జగన్ రాజకీయాలపై షర్మిల ఘాటు విమర్శలు గుప్పించారు. ‘‘నా కెరీర్‌ను, నా రాజకీయాల్ని నిర్దేశించడానికి మీరెవరు?. ఆస్తుల్లో నలుగురికీ సమాన వాటాలు దక్కాలన్నదే నాన్న ఆకాంక్ష. నాన్న ఆశలు, ఆకాంక్షలకు విరుద్ధంగా మీరు ఆలోచిస్తున్నారు. సాక్షి మీడియాలోనూ నాకు తీరని ద్రోహం చేశారు. నాన్న కలలో కూడా ఊహించని విధంగా అమ్మపై, నాపై కేసులు పెట్టారు. సరస్వతి పవర్‌లో అమ్మకు ఇచ్చిన షేర్లు మీరు రాసిచ్చినవి కావా?. ఆస్తుల్లో నాకు ఎలాంటి హక్కులు లేకుండా చేయకూడదనే మీ దుర్బుద్ధి అర్థమైంది. మీరు ఎన్ని చేసినా నా గమ్యాన్ని అడ్డుకోలేరు’’ అంటూ వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Oct 23 , 2024 | 09:27 PM