గ్రామాల్లో ధర్మ ప్రచారం జరగాలి: విజయేంద్ర సరస్వతి
ABN , Publish Date - Dec 09 , 2024 | 04:26 AM
దేశంలోని గ్రామగ్రామాన ధర్మ ప్రచారం జరగాలని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆకాంక్షించారు.
తిరుమల, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): దేశంలోని గ్రామగ్రామాన ధర్మ ప్రచారం జరగాలని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆకాంక్షించారు. ఆ దిశగా టీటీడీ కృషి చేస్తోందని చెప్పారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీవారిని పెద్దమర్యాదతో దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. దేశంలో ధర్మప్రచారానికి టీటీడీ ముఖ్య కేంద్రంగా ఉందన్నారు. తిరుమల పవిత్రంగా, స్వచ్ఛంగా ఉండేలా కూడా టీటీడీ నూతన బోర్డు ప్రయత్నాలు చేస్తోందని విజయేంద్ర సరస్వతి తెలిపారు. ధర్మప్రచారం సరైన రీతిలో జరిగితే వ్యవసాయం, వ్యాపారం అన్నీ బాగుంటాయన్నారు.