AP Politics: వైఎస్ జగన్‌కే సిట్టింగ్ ఎమ్మెల్యే సవాల్.. కాస్కో!!
ABN , Publish Date - Jan 05 , 2024 | 06:19 PM
పీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సర్వే పేరు చెప్పి తన గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గం, కళ్యాణ దుర్గం నుంచి రెండు చోట్ల తాను, తన భార్య పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
తాడేపల్లి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సర్వే పేరు చెప్పి తన గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గం, కళ్యాణ దుర్గం నుంచి రెండు చోట్ల తాను, తన భార్య పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
కాస్కో జగన్!
"రాయదుర్గం నుంచి నా భార్య తప్పని సరిగా పోటీ చేస్తారు. సీఎంను కలిసి మాట్లాడడం మాకు కుదరలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కలిసే అవకాశం రాలేదు. ఇంత కన్నా అవమానం మాకు ఎప్పుడు జరగలేదు. నమ్మించి తెచ్చి మా గొంతు కోశారు. ఇకనైనా సొంత నిర్ణయంతో స్వతంత్రంగా లేదా అవకాశం కల్పించిన ఏ పార్టీ అయినా పోటీకి సిద్దం. నేటికీ ఒక్కసారి కూడా వేరే పార్టీతో మాట్లాడలేదు. మా ఇంటి నిండా లైట్ లు వేస్తే జగన్ ఫోటో లే కనబడతాయి. వైసీపీ పెట్టినప్పుడు ఐదేళ్లు పదవీకాలం వదులుకొని వచ్చాను. 2014, 19లో పోటీ చేయను అన్నా మంత్రి పదవి ఇస్తాను అని పోటీ చేయించారు. రాత్రి, పగలు గడప గడపకు తిరిగాను అయిన సర్వే పేరుతో టికెట్ నిరాకరించారు. మా జీవితాలు సర్వనాశనం అయ్యాయి. ఈ రోజు వరకు జగన్ మా దేవుడు అనుకున్నాం. జగన్ మా గొంతు కొస్తాడనుకోలేదు. స్వతంత్రంగా గెలిచే సత్తా కూడా మాకు ఉంది" అని కాపు రామచంద్రారెడ్డి అన్నారు.