Share News

Kesineni Chinni: మా కుటుంబ కలహాలతో చంద్రబాబుకేం సంబంధం?

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:43 AM

ఎంపీ కేశినేని వ్యాఖ్యలపై ఆయన సోదరుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేశినేని శివనాథ్ (చిన్ని) స్పందించారు. తమ కుటుంబ కలహాలనేవి 1999 నుంచి ఉన్నాయని.. వాటితో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. నాని తనను ఎన్ని అన్నా 99 నుంచి తానే సర్దుకుపోతున్నానన్నారు.

Kesineni Chinni: మా కుటుంబ కలహాలతో చంద్రబాబుకేం సంబంధం?

అమరావతి: ఎంపీ కేశినేని వ్యాఖ్యలపై ఆయన సోదరుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేశినేని శివనాథ్ (చిన్ని) స్పందించారు. తమ కుటుంబ కలహాలనేవి 1999 నుంచి ఉన్నాయని.. వాటితో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. నాని తనను ఎన్ని అన్నా 99 నుంచి తానే సర్దుకుపోతున్నానన్నారు.

నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నానికి లేదని చిన్ని పేర్కొన్నారు. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్ష మరిచి మాట్లాడటం తగదన్నారు. ఎంతో మంది మహామహులు టీడీపీని వీడినా పార్టీకేం కాలేదన్నారు. వచ్చే వాళ్లు వస్తుంటారు.. పోయేవాళ్ళు పోతుంటారని ఇప్పటి వరకూ టీడీపీ ఎవరూ ఏం చేయలేకపోయారని కేశినేని చిన్ని అన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 11:43 AM