Kotamreddy Sridhar Reddy: అక్రమ వసూళ్లు, రౌడీ మామూళ్లు పిండేస్తున్నారు.. వైసీపీపై విమర్శలు
ABN , Publish Date - Jan 24 , 2024 | 08:20 AM
ఏపీలో రూ.వేల కోట్ల ఇసుక దోచేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. అనుమతిలేని రీచ్‌లలో తవ్వకాలు సాగిస్తూ ఒక్కో వాహనం నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు.
నెల్లూరు: ఏపీలో రూ.వేల కోట్ల ఇసుక దోచేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. అనుమతిలేని రీచ్‌లలో తవ్వకాలు సాగిస్తూ ఒక్కో వాహనం నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. అదీ చాలదన్నట్టు మూడు రోజులుగా అదనపు అక్రమ వసూళ్లు, రౌడీ మామూళ్లు పిండేస్తున్నారన్నారు.
మరో 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని.. ఇప్పటికైనా ఇసుక, సిలికా, క్వార్ట్జ్ అక్రమార్కులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. రాబోయేది టీడీపీ - జనసేన ప్రభుత్వమన్నారు. కాబోయే సీఎం చంద్రబాబుతో చెప్పి సీఐడీ విచారణ వేయిస్తామన్నారు. అక్రమార్కుల నుంచి దోపిడీ సొమ్ము వసూలు చేయిస్తామని తెలిపారు. దీనికి సహకరించిన అధికారులను సస్పెండ్ చేయిస్తామన్నారు. ఇసుక అక్రమాలపై పోరాటం ఆపేది లేదని హెచ్చరిస్తున్నామని కోటంరెడ్డి తెలిపారు.