KR Suryanarayana: గడువు ముగిసినా.. ఓటు హక్కు కల్పించాలి..
ABN , Publish Date - May 03 , 2024 | 08:46 PM
ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులకు.. పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) గడువు ముగిసిన తర్వాత కూడా ఓటు హక్కు కల్పించాలని కార్మిక పెన్సనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్. సూర్యనారాయణ డిమాండ్ చేశారు. రాజమండ్రిలో శుక్రవారం...
రాజమండ్రి: ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులకు.. పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) గడువు ముగిసిన తర్వాత కూడా ఓటు హక్కు కల్పించాలని కార్మిక పెన్సనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్. సూర్యనారాయణ డిమాండ్ చేశారు. రాజమండ్రిలో శుక్రవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్సనర్ల సంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ గడువు ముగిసిన తర్వాత.. ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులకు ఓటు హక్కు అవకాశాన్ని కల్పించాలన్నారు.
ఎన్నికల విధుల్లో (election duties) పాల్గొనే ప్రతి ఉద్యోగీ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూర్యనారాయణ కోరారు. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత.. 50 వేల మంది ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకున్నట్లు గుర్తించినట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో కార్మిక పెన్సనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్. సూర్యనారాయణ, కో-చైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్, ఉపాధ్యక్షులు పాపారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మాగంటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.