Share News

Celebrations: రాష్ట్ర వ్యాప్తంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ABN , Publish Date - Nov 26 , 2024 | 08:21 AM

75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సాధారణ పరిపాలనా శాఖ ప్రభుత్వ కార్యదర్శి (రాజకీయ) ఎస్.సురేశ్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తారు.

Celebrations: రాష్ట్ర వ్యాప్తంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు (75th Constitution, Day celebrations) ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం (AP Govt.,) నిర్ణయించింది. 1949 నవంబరు 26వ తేదీన కానిస్టిట్యుయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియాను అడాప్ట్ చేసుకుంది. 1950 నవంబరు 26 నుండి భారత రాజ్యాంగం (Constitution of India) అమలులోకి వచ్చింది. అమలులోకి వచ్చి నవంబర్ 26వ తేదికి 75 వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


కాగా మంగళవారం 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సాధారణ పరిపాలనా శాఖ ప్రభుత్వ కార్యదర్శి (రాజకీయ) ఎస్.సురేశ్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరితో రాజ్యాంగ పీఠికను చదివించాలని ఆయన సూచించారు. అమరావతి రాష్ట్ర సచివాలయం 5వ భవనంలో మంగళవారం ఉదయం11.30 గంటలకు జరిగే రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొంటున్నారు. అలాగే జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జిల్లాల మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు సమక్షంలో ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను ఈ 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు,శాఖాధిపతులకు ఆయన సూచించారు.

అలాగే మంగళవారం నుంచి ఏడాది పొడవునా జరిగే వేడుకల్లో రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం లాంటి కార్యక్రమాలను నగరాలు, గ్రామాలు, పాఠశాలల్లో నిర్వహించబోతున్నట్లు కేంద్ర సంస్కృతిక శాఖ తెలిపింది. నవంబర్‌ 26న (మంగళవారం) జరిగే రాజ్యాంగ దినోత్సవం కేవలం పార్లమెంటులో మాత్రమే జరుపుకునే సెలబ్రేషన్స్ కాదని.. దేశం మొత్తం జరుపుకోవాల్సిన పండుగని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా అందులోని విషయాలను దేశ ప్రజల ముందుకు తీసుకుపోతున్నామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శైలజ మృతి పై ఆందోళన..

తొలి రోజే ‘అదానీ’ రచ్చ

ఎనిమిది గంటల పెళ్లి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 26 , 2024 | 08:21 AM