Budget Meetings: అసెంబ్లీలో మంగళవారం ఏయే బిల్లులు ప్రవేశపెట్టనున్నారంటే..
ABN , Publish Date - Nov 19 , 2024 | 07:19 AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. అనంతరం పలు బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. కాగా పలు డిపార్టె మెంట్లకు సంబందించిన డిమాండ్స్‌పై ఆయా శాఖల మంత్రులు వివరణ ఇస్తారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly budget meetings) మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. (Question time continues). ప్రశ్నోత్తరాలు... ఉద్యోగుల అంతర్ రాష్ట్ర బదిలీలు, సాగునీటి కాల్వల నిర్వహణ, ఆక్వా రైతులపై పన్ను విధింపు, విద్యార్దులకు ఆర్ధిక సహాయం, కడప జిల్లాలో ఎస్సీ, ఎస్టీ లకు వాహనాల పంపిణీ తదితర వాటిపై చర్చ జరగనుంది. కాగా రిషికొండపై భవనాల నిర్మాణం, రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్, ఇతర సాగునీటి ప్రాజెక్టులపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
అలాగే ఐటిడిఏ ప్రొజెక్ట్ పాడేరు, పిలేరు నియోజక వర్గంలో అడవిపల్లి ప్రాజెక్టు, చేనేత కార్మికులకు ప్రోత్సాహకాలు, కార్మిక సంక్షేమం మండలి, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పధకంపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. కాగా పలు డిపార్టుమెంట్లకు సంబందించిన డిమాండ్స్‌పై ఆయా శాఖల మంత్రులు వివరణ ఇస్తారు. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం పలు బిల్లులు సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ సోసైటిస్ చట్ట సవరణ బిల్లు -2024, ఆంధ్ర ప్రదేశ్ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు, ఏపీ ప్రోహిబిషన్ చట్టసవరణ బిల్లు, ఇండియా మెడ్ లిక్కర్, ఫారన్ మెడ్ లిక్కర్ చట్ట సవరణ బిల్లులను సర్కార్ ప్రవేశపెట్టనుంది.
మరోవైపు ఏపీ శాసనమండలి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానుంది. ప్రశ్నోత్తరాలు... మదనపల్లిలో భూ రికార్డులు దగ్ధం, ఆక్వా రైతులకు ఆర్దిక సాయం, భీమిలిలో శారదా పీఠానికి భూముల కేటాయింపు, నెల్లి మర్ల జనపనార మిల్లు మూసివేత, విశాఖపట్నంలో రిషికోండ పర్యాటకం, రాష్ట్రంలో నూతన రహాదారుల మంజూరు, టిటిడి లడ్డులో కల్తీ నెయ్యి, రాష్ట్రంలో ఓడరేవులు, ఫిషింగ్ హర్బర్లు, ఆరోగ్య శ్రీ పధకంలో అక్రమాలు, వరదల కారణంగా పంట నష్టం, గ్రామాల్లో డంపింగ్ యార్డులు పంచాయితీ భవనాలకు రంగులు తదితర అంశాలపై చర్చ జరగనుంది. అనంతరం శాసన మండలిలో ప్రభుత్వం 5 బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ సవరణ బిల్లు -2024, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు, ఎన్టీఆర్ హెల్త్ యునివర్శిటి సవరణ బిల్లు, అయుర్వేదిక్ హోమియో పతిక్ చట్టసవరణ బిల్లు, మెడికల్ ప్రాక్టిసనర్స్ రిజిస్ట్రేషన్ చట్టసవరణ తదితర బిల్లులను ప్రవేశపెట్టనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ దెబ్బ.. రాష్ట్రం అబ్బా..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News