Share News

AP Assembly: సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ABN , Publish Date - Nov 11 , 2024 | 07:22 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. అయితే సమావేశాలు ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంకట పాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. అసెంబ్లీకి వెళ్లే తొలి రోజు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం అసెంబ్లీకి వెళ్లే ఆనవాయితీ... ఈ సందర్భంగా వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

AP Assembly: సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly budget meetings) సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించనుంది. అనంతరం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అసెంబ్లీలో బడ్జె‌ను ప్రవేశపెట్టనున్నారు. సుమారు రూ. 2.9 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడతారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ ప్రవేశ పెట్టనున్నారు. తర్వాత అసెంబ్లీ వాయిదా పడనుంది. అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు.

ఈ సమావేశాల్లోనే ఉభయ సభలు ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. ల్యాండ్ గ్రాబింగ్ నిరోధ‌క చ‌ట్టం 1982 రిపిల్ బిల్లును ప్రవేశ‌పెట్టే అవ‌కాశం ఉంది. దేవాల‌యాల పాల‌కమండళ్లలో ఆద‌నంగా మ‌రో ఇద్దరు స‌భ్యుల నియామ‌కంపై ప్రభుత్వం బిల్లు ప్రవేశ‌పెట్టనుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకువ‌చ్చిన జ్యూడిషియ‌ల్ ప్రివ్యూ ర‌ద్దు చేస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు ప్రవేశ‌పెట్టనుంది. జ్యూడిషియ‌ల్ అధికారుల ఉద్యోగ విర‌మ‌ణ వ‌య‌స్సు 61 ఏళ్లకు పెంచుతూ బిల్లు ప్రవేశ‌పెట్టనుంది. గత ప్రభుత్వం తెచ్చిన ప్రభుత్వ మద్యం దుకాణాల‌ను రద్దు చేస్తు తీసుకువ‌చ్చిన ఆర్ఢినెన్స్ స్థానంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశ‌పెట్టనున్నారు. అలాగే మ‌ద్యం ధ‌ర‌లు, నాణ్యతా ప్రమాణాలపై ప్రభుత్వం బిల్లు ప్రవేశ‌పెట్టనుంది.


కాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వెంకట పాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. అసెంబ్లీకి వెళ్లే తొలి రోజు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం అసెంబ్లీకి వెళ్లే ఆనవాయితీ... ఈ సందర్భంగా వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరు కాబోమని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వంపై తాము విమర్శలు చేస్తామని తెలిపారు. అది కూడా తన నివాసంలోని మీడియా పాయింట్‌ నుంచే ఈ విమర్శలు చేస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.

అదీకాక తమకు ప్రతిపక్ష హోదా కేటాయిస్తే.. అసెంబ్లీలో మైక్ అధిక సమయం కేటాయించాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వం భావనలా ఉందని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ అన్నారు. ఇక సోమవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఎమ్మెల్యేలు మాత్రమే హాజరుకానున్నారు.


ఇంకోవైపు ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అయితే గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీకి కేవలం ఈ ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాలే దక్కాయి. అంటే ప్రతిపక్ష హోదా సైతం ఆ పార్టీకి దక్కలేదు. అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ అసెంబ్లీ స్పీకర్‌ను కోరారు. సంఖ్యా బలం లేకుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడం కూదరదని స్పీకర్ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు జగన్‌తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకావడం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

అహంకారం.. ఆర్భాటం వద్దు

జగన్‌ ‘బొమ్మ’కు బిల్లులు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 11 , 2024 | 07:35 AM