Amaravati: ఏపీ కేబినెట్ సమావేశం
ABN , First Publish Date - 2024-02-07T07:51:12+05:30 IST
అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. అంతకుముందే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన ఛాంబర్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు పూజాలు నిర్వహించనున్నారు. ఈ కేబినెట్‌లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేయనున్నారు.
అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. అంతకుముందే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన ఛాంబర్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు పూజాలు నిర్వహించనున్నారు. ఈ కేబినెట్‌లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేయనున్నారు. మంత్రి మండలిలో శాసనసభలో ప్రవేశపెట్టే పలు సవరణ బిల్లులకు సైతం ఆమోదం తెలపనున్నారు. నాలుగు నెలలకు గాను రూ. 95 వేల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను బుధవారం ఉదయం 11 గంటల 3 నిమిషాలకు చట్టసభల్లో ప్రవేశపెట్టనుంది. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి రూ.2.86 లక్షల కోట్ల బడ్జెట్‌ను అంచనా వేయగా, ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ కింద 4 నెలలకు రూ.95 వేల కోట్ల నుంచి రూ.96 వేల కోట్ల వరకు బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నారు.
బడ్జెట్ ఎలా ఉండాలి.. ఎలా ఉంటోంది?
సాధారణంగా బడ్జెట్ అంటే రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది? ఎన్ని అప్పులు తెచ్చుకోవచ్చు? రాష్ట్రం ఖర్చులు ఎంత? అభివృద్ధి పనుల కోసం ఏ శాఖకు ఎంత కేటాయించాలి? ప్రజల కోసం చేయాల్సిన పనులు, వాటి ఖర్చుల వివరాలు ఉంటాయి. అందుకే బడ్జెట్ అంటే రాష్ట్ర ఆర్థిక స్థితిని ప్రతిబింబించే ఒక వాస్తవ సంఖ్య. కానీ, వైసీపీ హయాంలో బడ్జెట్ అంటే కేవలం ఒక ఫ్యాన్సీ నంబర్. జగన్ సర్కార్ బడ్జెట్ అంకెలు చూస్తుంటే, రాష్ట్ర ఆర్థిక స్థితిని కాకుండా న్యూమరాలజీ ప్రకారం బడ్జెట్ అంకెను ఓకే చేశారా అన్న అనుమానమైతే వస్తుంది. 2019-20లో రూ.2,27,974 కోట్లు, 2020-21లో రూ.2,24,789 కోట్లు, 2021-22లో రూ.2,29,779 కోట్లు , 2022-23లో రూ.2,56,256 కోట్లు, 2023-24లో రూ.2,79,279 కోట్లు బడ్జెట్ అంకెగా నిర్ణయించారు.