CM Chandrababu: జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Dec 21 , 2024 | 12:24 PM
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా జగన్‌కు సీఎం బర్త్‌డే విషెస్ తెలిపారు.
అమరావతి, డిసెంబర్ 21: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా జగన్‌కు పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. రాజకీయ పరంగా ఎన్ని విమర్శలు చేసుకున్నప్పటికీ పుట్టిన రోజు సందర్భాల్లో ఒకరికిఒకరు విషెష్ చెప్పుకోవడం రాజకీయాల్లో కామన్. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కూడా జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం, వైఎస్సార్సీపీ మధ్య ఎంతటి వైరం చోటు చేసుకుందో అందరికీ తెలిసిందే. నువ్వా - నేనా అన్న రీతిలో చంద్రబాబు, జగన్ తలపడుతున్న పరిస్థితి. అయితే వాటన్నింటినీ పక్కన పెట్టి మరీ జగన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే చంద్రబాబుతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా మాజీ ముఖ్యమంత్రికి బర్త్‌డే విషెష్ తెలియజేశారు.
ఏపీలో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు
చంద్రబాబు ట్వీట్..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా జగన్‌కు శుభాకాంక్షలు తెలియాజేశారు. జగన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు సీఎం. సంపూర్ణ ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పోస్టు చేశారు.
గవర్నర్ శుభాకాంక్షలు..
అలాగే జగన్‌కు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా జగన్‌కు విషెష్ తెలిపారు. ‘‘ ఆ భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్సును ప్రసాదించాలి అని కోరుకుంటున్నాను. సుదీర్ఘంగా ప్రజా సేవలో జగన్ ఉండాలి’’ అని ఆకాంక్షిస్తూ గవర్నర్ నజీర్ పోస్టు చేశారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పుట్టిన రోజు వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ధూంధాంగా జరుపుతున్నారు. పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేసి జగన్ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు.