Share News

Pawan Kalyan: నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN , Publish Date - Dec 30 , 2024 | 02:17 PM

Pawan Kalyan: నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపిక అవుతారు. మంత్రి అనేది తరువాత చర్చ చేస్తాం. నాగబాబు త్యాగం గుర్తించి రాజ్యసభ అనుకున్నాం. అక్కడ కుదరలేదు కాబట్టి.. ఎమ్మెల్సీ అనుకున్నాం. కందుల దుర్గేష్ ఏ కులమో నాకు తెలియదు. అతని పని తీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చాను.

Pawan Kalyan: నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Deputy CM Pawan Kalyan

విజయవాడ, డిసెంబర్ 30: జనసేన నేత నాగబాబుకు (Janasena Leader Nagababu) మంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌‌లో మాట్లాడుతూ... ‘‘మనతో ప్రయాణం చేసి, పని చేసిన వారిని నేను గుర్తించాలి నాగబాబు నాతో పాటు సమానంగా పని చేశారు. వైసీపీ నేతలతో తిట్లు తిన్నారు, పార్టీ కొసం నిలబడ్డారు. ఇక్కడ కులం, బంధు ప్రీతి కాదు.. పనిమంతుడా కాదా అనేదే ముఖ్యం. ఎంపీగా ప్రకటించి, మళ్లీ నాగబాబును తప్పించాం. మనోహర్, హరిప్రసాద్‌లు మొదటి నుంచి పార్టీ కోసం పని చేశారు. అలా ఎవరికి ప్రతిభ ఉందో చూసి పదవులు ఇస్తాం. ఇదే విషయంలో జగన్‌ను మీరెందుకు అడగలేదు. కేవలం పవన్ కళ్యాణ్‌ను మాత్రమే అడుగుతారు. మాకు బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా అన్నయ్య సొంతంగా ఎదిగారు. ఇప్పుడు మా తరువాతతరం పిల్లలకు ఒక బ్యాక్ గ్రౌండ్ ఉంది. నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపిక అవుతారు. మంత్రి అనేది తరువాత చర్చ చేస్తాం. నాగబాబు త్యాగం గుర్తించి రాజ్యసభ అనుకున్నాం. అక్కడ కుదరలేదు కాబట్టి.. ఎమ్మెల్సీ అనుకున్నాం. కందుల దుర్గేష్ ఏ కులమో నాకు తెలియదు. అతని పని తీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చాను. రాజకీయాల్లో కులం కాదు.. పని తీరే ప్రామాణికం’’ అనిచెప్పుకొచ్చారు. ముందు నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాకనే మంత్రి పదవి గురించి ఆలోచిస్తానని అన్నారు. ఎక్కడో ప్రత్యేక పరిస్థితులు ఉంటేనే ఎమ్మెల్సీ కాకముందు మంత్రి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇక్కడ ఇప్పుడు అంత ప్రత్యేక పరిస్థితులు ఏమి లేవన్నారు. అందువలన నాగబాబు ముందు ఎమ్మెల్సీ అవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.


జగన్‌పై ఇలా..

pawan-jagan.jpg

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పవన్ విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులు రౌడీల్లా వ్యవహరిస్తారని.. 11 సీట్లు వచ్చాక కూడా వారిలో మార్పు రాలేదని మండిపడ్డారు. వారి పార్టీ నేతలను జగన్ ఎందుకు ఆపడం‌లేదని ప్రశ్నించారు. ఎవరు దాడి చేసినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మనం కొంతమందిని చూసి కొన్ని నేర్చుకోవాలన్నారు. చేగువేరా నుంచి తాను కొన్ని నేర్చుకున్నానని తెలిపారు. జగన్ వలన కొన్ని తెలుస్తాయన్నారు. అధికారంలో లేకుండా అధికారుల్ని ఎలా బేధిరించాలి అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండగా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు కాబట్టే ఆయనకు ప్రజలు 11 సీట్లు ఇచ్చారన్నారు. అయినా ఆయనకు, ఆయన పార్టీ నేతలకు ఇంకా వాస్తవం తెలియడం లేదని డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేశారు.

మా అల్లుడు తగ్గుండాల్సిందే..


అప్పుడు మీరు తిట్టలేదా...

pawan-perni-nani.jpg

బియ్యం మాయం కేసులో పేర్నినాని ఉదంతంపై ప్రస్తావిస్తూ... రేషన్ బియ్యం మాయమైంది నిజమన్నారు. డబ్బులు కట్టింది వాస్తవమన్నారు. ఇంట్లో‌ ఆడవాళ్ల పేరుతో గోడౌన్ పెట్టింది ఎవరు అని ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లను మీరు తిట్టలేదా. మేము ఆడవాళ్లను కేసులో ఇరికించలేదే. ఆయన చేసిన తప్పుకు వాళ్లే ఇంట్లో వాళ్లను వీధిలోకి తెచ్చారు. అప్పుడు బూతులయ తిట్టి, ఇప్పుడు నీతులు వల్లిస్తే ఎలా. చట్ట ప్రకారం ఆ కేసులో చర్యలు ఉంటాయి’’ అని స్పష్టం చేశారు. భార్యను కేసులోకి లాగారని పేర్నినాని అనడం కరెక్ట్ కాదన్నారు. మరి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని గురించి వాళ్ళు ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. పేర్ని నాని గోడౌన్‌లో తప్పు జరుగకపోతే ఆయన 1 కోటి 70 లక్షల రూపాయలు ఎలా చెల్లించారని ప్రశ్నిస్తూ.. తప్పు జరిగింది కాబట్టే ఆయన చెల్లించారన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అన్న విషయం అందరు తెలుసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

మళ్లీ నిరాశపరిచిన సీనియర్లు.. ఇబ్బందుల్లో టీమిండియా

కొత్త సంవత్సరంలో జరగబోయే మార్పులు ఇవే

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 30 , 2024 | 02:24 PM