AP Assembly: అసెంబ్లీలో మూడు సవరణ బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్
ABN , Publish Date - Nov 13 , 2024 | 07:09 AM
అసెంబ్లీలో ప్రభుత్వం మూడు సవరణ బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ సవరణ బిల్లు - 2024 ను డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ప్రవేశ పెట్టనున్నారు. ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు- 2024 ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సవరణ బిల్లు-2024 ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెడతారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Meetings) బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. తర్వాత ప్రభుత్వం సభలో మూడు సవరణ బిల్లులు (3 Amendment Bills) ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ సవరణ బిల్లు - 2024 ను డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ప్రవేశ పెట్టనున్నారు. ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు- 2024 ను మంత్రి నారాయణ (Minister Narayana) ప్రవేశపెట్టనున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సవరణ బిల్లు-2024 ను మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) అసెంబ్లీలో ప్రవేశపెడతారు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు...
చింతలపూడి ఎత్తిపోతల పథకం, వీధికుక్కల బెడద, గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, విశాఖలో మెట్రోరైల్ నిర్మాణం, ఇరిగేషన్ కాలువల అధునీకరణ, రాష్ట్రంలో జాతీయ విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పన, డిఎస్సీ-1998.. తదితర వాటిపై చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల అనంతరం 2024 -25 ఆర్దిక బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది.
శాసనమండలి..
బుధవారం ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాలు ప్రారంభమవుతాయి. ఫ్రీ హోల్డ్ భూములు క్రమబద్దికరణ, కైకలూరు నియోజకవర్గంలో రహదారుల మరమ్మత్తులు, 2019 -24 వరకు మద్యం అమ్మకాలలో జరిగిన అక్రమాలు, గ్రామాల్లో డంపింగ్ యార్డులు, పంట రుణాలపై అధిక వడ్డీ, విజయనగరంలో ఆతిసారం, పిడిఎస్ బియ్యం అక్రమాలు, ఉచితపంటల భీమా పథకం, పంచాయితీ భవనాలకు రంగులు, పాఠశాల బస్సులకు పన్ను తదితర అంశాలపై చర్చ జరగనుంది. అనంతరం 2024 - 25 ఆర్ధిక బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News